Categories: TOP STORIES

తుస్సుమన్న తొర్రూరు ప్లాట్ల వేలం

  • 48 ప్లాట్లు వేలానికి పెడితే
  • 12 ప్లాట్ల‌కు మాత్ర‌మే బిడ్డ‌ర్లు
  • ఈ ప్లాట్ల‌కు గిరాకీ ఎందుకు త‌గ్గింది?

తొర్రూరులో హెచ్ఎండీఏ నిర్వ‌హించిన ప్లాట్ల వేలం తుస్సుమ‌న్న‌ది. సోమ‌వారం ఉద‌యం 25 ప్లాట్ల‌కు వేలం ప్ర‌క్రియ నిర్వ‌హిస్తే.. కేవ‌లం ఐదు ప్లాట్ల‌కు మాత్ర‌మే బిడ్డింగ్ జ‌రిగింది. సాయంత్రం 23 ప్లాట్ల‌కు గాను కేవ‌లం ఏడు ప్లాట్ల‌కు మాత్రమే బిడ్డింగ్ జ‌రిగింది. మొత్తం 48 ప్లాట్ల‌కు గాను కేవ‌లం 12 ప్లాట్లను మాత్ర‌మే బ‌య్య‌ర్లు ఎంపిక చేసుకున్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేనివిధంగా ఈ వేలానికి మాత్ర‌మే కొనుగోలుదారుల నుంచి స్పంద‌న కరువైంది. ఇక్క‌డి మార్కెట్ రేటు కంటే క‌నీస ధ‌ర ఎక్కువ పెట్టారా? లేక మార్కెట్లో ప్లాట్ల‌కు గిరాకీ త‌గ్గిందా? వంటి అంశాల్ని హెచ్ఎండీఏ అధికారులు విశ్లేషిస్తున్నారు. అమెరికాలో మాంద్యం ప్ర‌భావం ఐటీ రంగం మీద క్ర‌మ‌క్ర‌మంగా ప‌డుతోంద‌ని.. అందుకే, ఐటీ నిపుణులు ప్లాట్లు, ఫ్లాట్ల‌లో పెట్టుబ‌డులు పెట్టేందుకు వెన‌కంజ వేస్తున్నార‌ని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎం.ఎస్.టి.సి నిర్వహించిన ఆన్ లైన్ వేలం(ఈ-ఆక్షన్)లో ప్లాట్లు మార్నింగ్ సెషన్లో జ‌రిగిన బిడ్డింగులో అత్యధికంగా గజం రూ.30,000ల ధర పలుకగా, అత్యల్పంగా గజం రూ. 20,500లు బిడ్డర్లు కోట్ చేశారు. సాయంత్రం సెషన్ లో అత్యధికంగా గజం రూ.30,000ల ధర పలుకగా, అత్యల్పంగా గజం రూ. 20,500లకు బిడ్డర్లు కోట్ చేశారు. సోమవారం చివరి రోజున జరిగిన వేలం ద్వారా రూ. 8.10 కోట్ల విలువ చేసే 12 ప్లాట్ల అమ్మకాలు జరిగాయి.

This website uses cookies.