Categories: Celebrity Homes

న‌య‌న్‌కు.. న‌గ‌రంలో రెండు ఖ‌రీదైన ఫ్లాట్లు!

ద‌క్షిణాది లేడి సూప‌ర్ స్టార్‌.. న‌య‌న‌తార‌. అందానికి, అభిన‌యానికి మారు పేరు. అందుకే, ఆమెకు సినీ రంగంలో ఎక్క‌డ్లేని స్టార్‌డ‌మ్ తెచ్చి పెట్టింది. ర‌క‌ర‌కాల అంశాల‌తో త‌రుచూ వార్త‌ల్లో క‌నిపించే న‌య‌న్‌కు హైద‌రాబాద్‌లోని బంజారాహిల్స్‌లో రెండు ఖ‌రీదైన ఫ్లాట్లు ఉన్నాయ‌నే విష‌యం చాలామందికి తెలియ‌దు. ప్ర‌ముఖులు నివ‌సించే క‌మ్యూనిటీలోనే ఆమెకు ల‌గ్జ‌రీ గృహాలున్నాయ‌ని స‌మాచారం. ఈ ఒక్కో ఫ్లాట్ విలువ.. దాదాపు రూ.10 కోట్లు ఉంటుంది. ఇంటీరియ‌ర్స్ క‌లుపుకుంటే సుమారు ప‌దిహేను కోట్లు అవుతుంది. ఇక్క‌డే కాదు.. దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల్లో ఆమెకు ఖ‌రీదైన ఫ్లాట్లు ఉన్నాయి. చెన్నైలో అయితే ఖ‌రీదైన ల‌గ్జ‌రీ గృహాన్ని చూస్తే ఎవ‌రికైనా మ‌తిపోవాల్సిందే.

న‌య‌న్ ఫ్లాట్ ఇంటీరియ‌ర్స్ చూస్తే ఎవ‌రైనా ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. ఆమెకెంతో ఫ్యాష‌న్‌ సెన్స్ ఉంద‌ని ఈ విలాస‌వంత‌మైన ఫ్లాట్‌ని చూస్తే ఎవ‌రికైనా అర్థ‌మ‌వుతుంది. వివిధ ప్రదేశాల నుండి తీయబడినట్లుగా కనిపించే ప్రత్యేకమైన కళాఖండాలతో నిండి ఉంటుంది. ఇంటిలోని ప్రతి మూల అందంగా ద‌ర్శ‌న‌మిస్తుంది. అపార్టుమెంట్ గోడలు పాస్టెల్ ఆఫ్-వైట్‌తో పాటు పసుపు సీలింగ్ లైట్లతో ఉంటాయి. కుర్చీ కవర్లు, సోఫా రంగుల్లో తటస్థ టోన్ ఉంటుంది. ఫర్నిచర్ మ్యూట్ మరియు లైట్ టోన్డ్ షేడ్స్ కలిగి ఉంది. ఎల్ఈడీ లైటింగ్, ఫాల్స్ సీలింగ్ కలిసి ఈ ప్రదేశానికి చిక్ మరియు రాయల్ లుక్‌ని తీసుకొచ్చాయి.

This website uses cookies.