పురపాలక శాఖ హైదరాబాద్‌లో కొత్తగా 118 వాణిజ్య రహదారుల్ని ( Commercial Roads ) ప్రకటించింది. ఈ మేరకు ఇటీవల 102 జీవోను విడుదల చేసింది. వంద అడుగుల వెడల్పు గల ఈ రహదారుల్లో నివాస, వాణిజ్య, సంస్థాగత భవనాలు, ఐటీ నిర్మాణాల్ని కట్టేందుకు ప్రత్యేకంగా స్థల మార్పిడి చేయనక్కర్లేదు. ఇప్పటికే గుర్తించిన వాణిజ్య రహదారులకు అదనంగా ఈ 118 రహదారుల్ని తాజాగా పురపాలక శాఖ గుర్తించింది. ఆయా ప్రాంతాలున్న పరిధిని బట్టి జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలు నివాస / వాణిజ్య / సంస్థాగత భవనాలు / ఐటి భవనాలు / మిశ్రమ వినియోగ భవనాల నిర్మాణానికి భవన అనుమతులిస్తాయి. వాస్తవానికి,
2007లో విడుదలైన జీవో నెం 766 ప్రకారం.. జీహెచ్ఎంసీ ప్రధాన ప్రాంతంలోని కొన్ని రహదారులను వాణిజ్య రహదారులుగా ప్రకటించింది. అక్కడ నివాస, వాణిజ్య, సంస్థాగత భవనాల నిర్మాణానికి జీహెచ్ఎంసీ కమిషనర్ అనుమతినిచ్చేవారు. మాస్టర్ ప్లాన్‌లో పేర్కొన్న భూ వినియోగంతో సంబంధం లేకుండా ఇంపాక్ట్ ఫీజు వసూలు చేసేవారు. కాకపోతే, ఆతర్వాత పెరిగిన పట్టణీకరణ వల్ల జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలోని మరికొన్ని రహదారులు వాణిజ్య అభివృద్ధికి అవకాశం ఉందని, వాటిని వాణిజ్య రహదారులుగా ప్రకటించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం దృష్టికొచ్చింది. అక్కడ ఇంపాక్టు ఫీజును హేతుబద్ధంగా సవరించాలనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇందుకు సంబంధించి 2019 సెప్టెంబరు 7న పురపాలక శాఖ మెమో విడుదల చేసింది. ఈ ప్రతిపాదనపై అభ్యంతరాలు, సలహాల్ని కోరింది. దీంతో ప్రభుత్వం పలు అభ్యంతరాలు, సలహాల్ని అందుకుంది. ప్రతిపాదిత ప్రభావ రుసుము రేట్లు తగ్గించాలని.. మరికొన్ని రహదారులను వాణిజ్య రహదారులుగా ప్రకటించాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. పైగా, ఇప్పటికే ఉన్న వాణిజ్య బెల్ట్‌లో భాగమైన లేదా ఇప్పటికే ఖాళీగా ఉన్న పారిశ్రామిక ప్లాట్లలో వాణిజ్య కార్యకలాపాలను అనుమతించాలనే సూచన ఎక్కువగా వచ్చింది. కాకపోతే, పారిశ్రామిక ప్లాట్లలో వాణిజ్య కార్యకలాపాలను ఇంపాక్ట్ ఫీజు చెల్లింపుపై అనుమతించాలనే సూచన అంగీకరించలేదు.
ఇంపాక్టు ఫీజు ఎంత?
ఏ తరహా కార్యకలాపాలు గ్రౌండ్ ప్లస్ గ్రౌండ్ ప్లస్ 1
1 అంతస్తు అంతస్తు దాటితే
మల్టీప్లెక్సులు, సినిమా థియేటర్లు,
షోరూములు,మాళ్లు, హోటళ్లు, పబ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లు,
ఆఫీసు సముదాయాలు, ఐటీ,ఐటీఈఎస్ భవనాలు, 6 శాతం 3 శాతం
హోల్ సేల్ మార్కెట్, పెట్రోల్ బంకులు, లేదా 300 చ.అ.కీ. లేదా 150 చ.అ.కీ.
ఆస్పత్రులు, నర్సింగ్ హోమ్స్, స్కూళ్లు, 2 శాతం 1 శాతం
కాలేజీలు, సంస్థాగత భవనాలు, 500 చ.మీ.లోపు నిర్మాణాలు, లేదా 100 చ.అ.కీ లేదా 50 చ.అ.కీ
(షోరూములు, బంగారు దుకాణాలు, సూపర్ మార్కెట్లు
మినహాయించి)