అతనో యువ బిల్డర్. నిన్నా మొన్నటివరకూ కన్సల్టెంట్‌గా కొన్ని ప్లాట్లు విక్రయించాడు. మార్కెట్ సహకరించడంతో మంచి లాభాల్ని గడించాడు. కొందరిని పెట్టుబడిదారుల్ని పట్టుకుని.. కొంత కాలం క్రితం ఎంచక్కా బిల్డర్‌గా అవతారమెత్తాడు. బాచుపల్లి, శంకర్‌పల్లిలో కొత్త ప్రాజెక్టుల్ని ఆరంభించాడు. రెరా అనుమతి తీసుకుని కొన్ని.. తీసుకోకుండా మరిన్ని మార్కెట్లో అమ్మకానికి పెట్టాడు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఈ వ్యక్తి ఐటీ ఉద్యోగం వదలుకుని రియల్ రంగంలోకి ప్రవేశించాడని సమాచారం. అంతా బాగానే ఉంది కానీ, నిర్మాణ రంగానికి సంబంధించిన కొన్ని ప్రాథమిక విషయాలు ఇతనికి తెలియదని సమాచారం. ఇలాంటి కొత్త బిల్డర్లే హైదరాబాద్ నిర్మాణ రంగానికి లేనిపోని తలనొప్పులు తెచ్చే అవకాశముంది.
మార్కెట్లో బూమ్ ఉన్నప్పుడు ఎలాంటి ప్లాట్లు అయినా ఫ్లాట్లు అయినా ఇట్టే అమ్ముడౌతాయి. కానీ, మార్కెట్ మెరుగ్గా లేకపోతే ఒక్కసారిగా పరిస్థితి తలకిందులౌతుంది. ఈ విషయం అనుభవజ్ఞులైన డెవలపర్లకు తెలుసు. కానీ, కొత్తవాళ్లకు ఇవన్నీ తెలియదు. ఎప్పుడూ మార్కెట్ మెరుగ్గానే ఉంటుందని భ్రమలో ఉంటారు. రెరా అనుమతి తీసుకోకుండానే విక్రయాలు మొదలు పెడతారు. సేల్స్, మార్కెటింగ్‌కు తేడా తెలియక ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని సమాచారం. లీడ్స్ ఎలా జనరేట్ చేయాలో తెలియదు. ఇంకా పాత పద్ధతిలోనే పరుగు పెడుతున్నాడు. అమ్మకాల్లో కొత్త టెక్నిక్ తెలియకపోవడం వల్లే ఈ ఇబ్బందులు ఎదురౌతున్నాయని సమాచారం.
This website uses cookies.