వైవిధ్యంగా ఆలోచించడమంటే ఇదే.. డెవలపర్లు ఇలాగే వినూత్నంగా ఆలోచించాలి. మూడు వందల చదరపు మీటర్ల దూరంలో.. పలు సంస్థలు హైరైజ్ నిర్మాణాల్ని కడుతుంటే.. అక్కడ కమర్షియల్ ప్రాజెక్టు కట్టకూడదని సాయి కృపా వెంచర్స్ సంస్థ భావించింది. భవిష్యత్తు అవసరాల్ని పక్కాగా అంచనా వేసి.. మార్కెట్ ను క్షుణ్నంగా అధ్యయనం చేసి.. ఎకరాల స్థలంలో కమర్షియల్ ప్రాజెక్టును ఆరంభించింది. దీనికి సాయి కృపాస్ వీరా అని నామకరణం చేసింది.
మెట్రో రైలు డిపో ఏర్పాటు చేయడంతో ఒక్కసారిగా మియాపూర్ హాట్ లొకేషన్‌గా అవతరించింది. ప్రధానంగా, మియాపూర్ చౌరస్తా నుంచి బాచుపల్లి దాకా పలు సంస్థలు బడా హైరైజ్ నిర్మాణాల్ని నిర్మిస్తున్నాయి. సరిగ్గా ఇక్కడ వాణిజ్య సముదాయం కడితే మంచి గిరాకీ ఉంటుందని అంచనా వేసింది. పది అంతస్తుల ఎత్తులో వాణిజ్య భవనాన్ని ఆరంభించింది. ప్రస్తుతం నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్న ఈ కమర్షియల్ ప్రాజెక్టులో.. మూడు అంతస్తుల్ని రిటైల్ కోసం కేటాయించారు. మిగతా ఏడు అంతస్తుల్లో బ్యాంకెట్ హాళ్లు, కో-లివింగ్, కో-వర్కింగ్, రెస్టారెంట్లు, పబ్‌లు, హోటళ్లు, ఆస్పత్రులు, క్లీనిక్‌లు వంటివి ఏర్పాటవుతాయని సంస్థ ఎండీ కాచం రాజేశ్వర్ తెలిపారు. రెండు వైపులా రోడ్డు రావడం తమకు కలిసొచ్చిందని.. స్థానిక సంస్థల నుంచి అనుమతి పొందిన వాణిజ్య సముదాయాలు లేకపోవడంతో తమదే ప్రప్రథమ రెరా అనుమతి పొందిన కమర్షియల్ కాంప్లెక్సు అని వివరించారు.
This website uses cookies.