Categories: PROJECT ANALYSIS

28 ఎకరాల్లో.. ప్రణీత్ నైట్ వుడ్స్

ప్రణీత్ గ్రూప్ బీరంగూడలో నైట్ వుడ్స్ అనే లగ్జరీ గేటెడ్ విల్లా కమ్యూనిటీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి బ్రోచర్ ను ఇటీవల సంస్థ ఎండీ నరేంద్ర కామరాజు జూబ్లీహిల్స్ లోని కార్పొరేట్ కార్యాలయంలో ఆవిష్కరించారు. జీహెచ్ఎంసీ అనుమతి పొందిన ఈ ప్రాజెక్టులో ప్రణీత్ దాదాపు 459 విల్లాల్ని డెవలప్ చేస్తుంది. సుమారు 28కి పైగా ఎకరాల విస్తీర్ణంలో ప్రణీత్ చేపడుతున్న నైట్ వుడ్స్ ప్రాజెక్టులో 150 నుంచి 213 గజాల్లో డ్యూప్లే, ట్రిప్లేలను డెవలప్ చేస్తోంది.

ప్రణీత్ గ్రూప్ కట్టే విల్లాలు ఎలాగుంటాయో బీరంగూడలో కట్టిన విల్లాల్ని చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. అందుకే, ఈ సంస్థ కట్టే విల్లాలకు కొనుగోలుదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. వాస్తవానికి, బీరంగూడ ప్రాంతానికి క్రేజ్ తెచ్చింది ప్రణీత్ గ్రూప్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం పునాదుల స్థాయిలో ఉన్న ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాలన్న లక్ష్యంతో సంస్థ ముందుకెళుతోంది. ధర అంటారా? ఆరంభ రేటు.. రూ.1.35 కోట్లుగా నిర్ణయించింది. కాస్త పెద్ద సైజు ట్రిప్లే కావాలంటే.. దాదాపు రూ.1.80 కోట్ల దాకా పెట్టాల్సి ఉంటుంది.

బయ్యర్ల అభిరుచికి అనుగుణంగా..

ప్రణీత్ సంస్థ ఎప్పుడు నిర్మాణాల్ని చేపట్టినా, బయ్యర్ల అభిరుచికి తగ్గట్టుగానే ప్రాజెక్టును డిజైన్ చేస్తుంది. వారికేం కావాలో ముందే ఆలోచించి అందులో ఆధునిక సదుపాయాల్ని పొందుపరుస్తుంది. నైట్ వుడ్స్ లో హార్టికల్చర్ ల్యాండ్ స్కేపింగ్ కు పెద్దపీట వేసింది. ఇందులోని క్లబ్ హౌజ్ ను జి ప్లస్ 3 అంతస్తుల ఎత్తులో.. 37,700 చదరపు అడుగుల విస్తీర్ణంలో కడుతున్నారు. గచ్చబౌలి, కోకాపేట్ వంటి ప్రాంతాల్లో కట్టే లగ్జరీ విల్లాలకు ఏమాత్రం తీసిపోని విధంగా.. ఇందులో ఆధునిక సదుపాయాల్ని పొందుపరుస్తున్నారు. ఏసీ జిమ్, మినీ హోమ్ థియేటర్, ఔట్ డోర్ ఫిట్ నెస్ స్టేషన్, యాంఫీ థియేటర్, స్కేటింగ్ రింక్, సైకిల్ ట్రాక్, ఎస్టీపీతో పాటు కిచెన్ వేస్ట్ కన్వర్టర్ వంటివి కల్పిస్తున్నారు. గేమ్ జోన్ తో పాటు.. ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టు, టెన్నిస్ కోర్టు, బాస్కెట్ బాల్ కోర్టు, చిల్డ్రన్ ప్లే ఏరియా, జాగింగ్ ట్రాక్, ప్లే స్టేషన్ వంటివి పొందుపరుస్తారు. మొత్తానికి, ఆధునిక యువతీయువకుల ఆలోచనల్ని తగ్గట్టుగానే ఈ మొత్తం విల్లా ప్రాజెక్టును సంస్థ తీర్చిదిద్దుతోంది.

This website uses cookies.