హైదరాబాద్‌లోని ద మోస్ట్ ప్రెస్టీజియస్ లొకేషన్ అయిన కోకాపేట్ నియోపోలిస్‌లో.. 7.34 ఎకరాల్లో.. 63 అంతస్తుల 5 విలాసవంతమైన టవర్ల ప్రాజెక్టు ప్రారంభమైంది. ఈ ఆకాశహర్మ్యాన్ని జీహెచ్ఆర్ లక్ష్మీ అర్బన్ బ్లాక్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. మూడు మరియు నాలుగు బెడ్‌రూం ఫ్లాట్లతో బాటు ప్రైవేటు పూల్స్ తో కూడిన 10 ప్రత్యేకమైన ట్రిప్లెక్సులు, పెంట్ హౌస్‌లు వంటివి ఇందులో డిజైన్ చేశారు.
ALSO READ: హైదరాబాద్‌లో కొత్తగా 25 స్టార్ హోటళ్లు..!
ఇందులో వచ్చేవి మొత్తం 1199 యూనిట్లు. సుమారు 2560 నుంచి 3390 చదరపు అడుగుల్లో త్రీ బెడ్‌రూం ఫ్లాట్లు.. 3895 నుంచి 4825 చదరపు అడుగుల్లో 4 బీహెచ్‌కే ఫ్లాట్లను డిజైన్ చేశారు. ఇందులో ఏడు పార్కింగ్ ఫ్లోర్లు, ఒక ఫ్లోరులో పోడియం ఎమినిటీస్, 54 రెసిడెన్షియల్ ఫ్లోర్లు, రూఫ్‌టాప్ ఎమినిటీఎస్ కోసం ఒక ఫ్లోరును ఇందులో కేటాయించారు. ప్రత్యేకంగా రెండు హెలిప్యాడ్‌లను డిజైన్ చేశారు.