* 2,000 చదరపు మీటర్ల లోపు ఫామ్ ప్లాట్లు ( Farm Plots )
* స్థానిక సంస్థల అనుమతి తప్పనిసరి
హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు నగరానికి దాదాపు వంద కిలోమీటర్లకు చేరువలో ఫామ్ ప్లాట్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. స్థానిక సంస్థల నుంచి ఎలాంటి అనుమతి లేకుండా అనేక రియల్టీ కంపెనీలు ఇష్టం వచ్చినట్లుగా వీటిని అమాయకులకు అంటగడుతున్నాయి. ఈ విభాగంలో పెరిగిపోతున్న మోసాల్ని గుర్తించిన తెలంగాణ పురపాలక శాఖ తాజాగా రిజిస్ట్రేషన్ శాఖకో లేఖ రాసింది. 2000 చదరపు మీటర్ల కంటే లోపు విక్రయించే ఫామ్‌ప్లాట్లను ఎట్టి పరిస్థితిల్లో రిజిస్టర్ చేయకూడదని ఆ లేఖలో కోరింది.
పురపాలక శాఖ తాజా ఆదేశాల ప్రకారం.. ఏ సంస్థ అయినా చిన్న విస్తీర్ణంలో ప్లాట్లను అమ్మాలనుకుంటే.. నిబంధనల ప్రకారం స్థానిక సంస్థలకు ఫీజులు చెల్లించి లేఅవుట్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి, ప్రతిఒక్క రియల్ సంస్థ ఈ కొత్త నిబంధనకు అనుగుణంగా ఫామ్ ప్లాట్లను విక్రయించాల్సిందే.
This website uses cookies.