Categories: LATEST UPDATES

ఇళ్ల అమ్మకాల్లో నోయిడా అదుర్స్

గతేడాది రికార్డు స్థాయిలో రూ.24,944 కోట్ల
విలువైన 14,822 ప్లాట్ల విక్రయం

రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ లో నోయిడా దుమ్ము రేపింది. గతేడాది రికార్డు స్థాయిలో అక్కడ ఇళ్ల అమ్మకాలు జరిగాయి. 2023లో మొత్తం రూ.24,944 కోట్ల విలువైన 14,822 ప్లాట్లు విక్రయమైనట్టు జేఎల్ఎల్ నివేదిక తెలిపింది. ఆశాజనకమైన అభివృద్ధి అవకాశాలు, మెరుగైన పెట్టుబడులు, మెరుగైన ఉద్యోగ అవకాశాలు, అధిక నాణ్యత కలిగిన ఇళ్ల లభ్యత వంటి అంశాలు ఈ వృద్ధికి దోహదపడ్డాయి. ముఖ్యంగా నోయిడాలోని అపార్ట్ మెంట్ సగటు ధర 2022లో రూ.1.24 కోట్లు ఉండగా..

2023లో అది రూ.1.68 కోట్లకు పెరిగింది. నిలిచిపోయిన ప్రాజెక్టులను ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా పునరుద్ధరించడం కూడా మార్కెట్ పై మరింత విశ్వాసం పెంచింది. అందుబాటు ధరలు, మాస్ హౌసింగ్ మార్కెట్ గా గుర్తింపు పొందిన నోయిడాలో ఇప్పుడు లగ్జరీ ఇళ్ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. 2023లో నోయిడాలో జరిగిన మొత్తం అమ్మకాల్లో రూ.3.5 కోట్లు అంతకంటే ఎక్కువ ధర కలిగిన అపార్ట్ మెంట్ల వాటా 23 శాతం ఉండటం విశేషం. కొత్త లాంచ్ లు పెరిగినా.. అమ్ముడుపోని ఇన్వెంటరీ తగ్గింది.

This website uses cookies.