వివిధ కారణాలతో మధ్యలో నిలిచిపోయిన ప్రాజెక్టులపై సంబంధిత అధికారం దృష్టి సారించింది. ఆయా ప్రాజెక్టుల బిల్డర్లకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఈనెలలోనే కసరత్తు మొదలు కానుంది. నిర్దేశిత గడువులోగా పూర్తికాని ప్రాజెక్టును ల్యాప్స్ డ్ ప్రాజెక్టుగా పేర్కొంటారు. గడువు పూర్తయిన తర్వాత అదనపు గడువు కోసం దరఖాస్తు చేసుకోని ప్రాజెక్టులన్నీ ఈ జాబితాలోకి వస్తాయి. ఒకసారి ఓ ప్రాజెక్టును ల్యాప్స్ డ్ అని ప్రకటిస్తే.. ఇక దాని డెవలపర్ ఫ్లాట్ల క్రయవిక్రయాలకు సంబంధించి ఎలాంటి కార్యకలాపాలూ నిర్వహించడానికి వీల్లేదు. ప్రకటనలు ఇవ్వడం, ఫ్లాట్లు అమ్మడం, ఆఫర్లు ఇవ్వడం వంటివి ఏమీ చేయకూడదు. రెవెన్యూ విభాగం కూడా అలాంటి ప్రాజెక్టులను రిజిస్టర్ చేయకూడదు. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రాజెక్టులపై మహారాష్ట్ర రెరా దృష్టి పెట్టింది.
This website uses cookies.