Categories: LATEST UPDATES

సీఆర్డీఏకు హ్యాపీ నెస్ట్ కొనుగోలుదారుల నోటీసులు

ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథార్టీ(సీఆర్డీఏ)కు హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టులోని ఇళ్ల కొనుగోలుదారులు లీగల్ నోటీసులు ఇచ్చారు. నిర్దేశిత సమయంలోగా ప్రాజెక్టు పూర్తిచేయని కారణంగా తాము వెచ్చించిన మొత్తానికి 14 శాతం వడ్డీ చెల్లించాలని అందులో కోరారు. అలాగే ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో తాము పడిన మానసిక వేదనకు రూ.20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

సీఆర్డీఏతో చేసుకున్న ఒప్పందం మేరకు కొనుగోలుదారులు ఫ్లాట్ మొత్తం ఖరీదలో 10శాతం ముందు చెల్లించాలి. అనంతరం ప్రాజెక్టు పురోగతికి తగినట్టుగా మిగిలిన మొత్తాన్ని చెల్లించాలి. అయితే, ఫ్లాట్ల అప్పగింత గడువు ముగిసిన నేపథ్యంలో 10 శాతం చొప్పున చెల్లించిన 26 మంది కొనుగోలుదారులు సీఆర్డీఏకు నోటీసులు ఇచ్చారు. ఒప్పందం మేరకు అన్ని వసతులు, సౌకర్యాలతో వెంటనే ఫ్లాట్లు అప్పగించాలని స్పష్టంచేశారు.

రెరా చట్టం ప్రకారం నిర్దేశిత గడువులోగా ఫ్లాట్ అప్పగించని పక్షంలో ఆ తేదీ నుంచి ఫ్లాట్ అప్పగించే వరకు ప్రాథమిక వడ్డీ రేటుతోపాటు అదనంగా 2 శాతం వడ్డీని డెవలపర్ చెల్లించాల్సి ఉంటుంది.

This website uses cookies.