హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ) ఆధ్వర్యంలో శుక్రవారం మూడు చోట్ల నిర్వహించిన ‘‘ప్రీబిడ్ మీటింగ్స్’’ విజయవంతం అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు రాజీవ్ స్వగృహకు సంబంధించిన ప్లాట్లు, టవర్స్‌ను ఆన్లైన్ వేలం(ఈ–ఆక్షన్) పద్దతిలో విక్రయాలకు పెట్టిన సంగతి తెలిసిందే. వాటిలో భాగంగా బండ్లగూడ(నాగోల్–హైదరాబాద్) రాజీవ్ స్వగృహ టవర్స్(అపార్ట్ మెంట్స్) ప్రాంగణంలో శుక్రవారం ఉదయం మొదటి ప్రీబిడ్ సమావేశం జరిగింది.
అదేవిధంగా మేడ్చెల్ మల్కాజ్ గిరి జిల్లా పరిధిలోని బహదూర్ పల్లి(దుండిగల్ మున్సిపాలిటీ)లో 101 ప్లాట్ల విక్రయాలపై శుక్రవారం మద్యాహ్నం రెండో దఫా ప్రీబిడ్ మీటింగ్ ను హెచ్ఎండిఏ అధికారులు నిర్వహించారు. ఈ రెండు ప్రీబిడ్ సమావేశాలకు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజినీర్ బిఎల్ఎన్ రెడ్డి, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ చీఫ్ ఇంజినీర్ డాక్టర్ ఎస్.ఈశ్వరయ్య, హెచ్ఎండిఏ సెక్రెటరీ చంద్రయ్య, ఎస్టేట్ ఆఫీసర్ గంగాధర్, ఓఎస్డీ ఎం.రాంకిషన్, సీజీఎం మాజీద్ షరీఫ్ లతో పాటు ఆన్ లైన్ వేలం నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టిసి అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ చీఫ్ ఇంజినీర్ ఈశ్వరయ్య మాట్లాడుతూ నాగోల్ బండ్లగూడ వద్ద 26 ఎకరాల విస్తీర్ణంలో 33 టవర్స్(అపార్ట్ మెంట్స్)లతో మొత్తం 2,700 ఫ్లాట్లను రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నిర్మించిందని, వాటిలో కేవలం 500 ఫ్లాట్లు విక్రయించినట్లు తెలిపారు. మిగతా వాటిల్లో చాలా వరకు రెడీ టు ఆకుపై(నివాసానికి సిద్ధంగా) ఉన్నాయని చెప్పారు. 2008 సంవత్సరంలో ముంబాయికి చెందిన అర్కిటెక్చర్ కంపెనీతో డిజైన్ చేయించి నిర్మించిన ఇక్కడి అపార్ట్ మెంట్ జీహెచ్ఎంసీ పరిధిలో అన్నిరకాల మౌళిక వసతులు అందుబాటులో ఉన్నాయని వివరించారు.
ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ స్వగృహ కు సంబంధించిన ఎనిమిది(8) టవర్స్(అపార్ట్ మెంట్స్) ప్రీబిడ్ సమావేశం శుక్రవారం నాడు ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, హెచ్ఎండిఏ సూపరింటెండెంటింగ్ ఇంజినీర్ యూసుఫ్ హుస్సేన్ ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగింది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లో జరిగిన ప్రీబిడ్ సమావేశంలో కమిషనర్ వేలం ప్రక్రియకు సంబంధించిన నియమ నిబంధనలను వివరించారు. హెచ్ఎండిఏ నిర్వహిస్తున్న బాధ్యతల గురించిన యూసుఫ్ హుస్సేన్ వివరించారు.
This website uses cookies.