poulomi avante poulomi avante

ఎన్నారైల చూపు ఎటువైపు?

NRI's Property Buying Options..

కరోనా తర్వాత దేశంలో లగ్జరీ హౌసింగ్ విభాగానికి డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో రూ.1.5 కోట్లకు పైగా విలువై గృహాల అమ్మకాలు గతేడాదితో పోలిస్తే 270 శాతం మేర పెరిగాయి. ఈ విభాగంలో ఇళ్ల కొనుగోలుకు రుణాలపై ఆధారపడటం చాలా తక్కువ. ప్రస్తుతం ప్రపంచమంతా తిరిగా పాత సాధారణ స్థితికి చేరిన నేపథ్యంలో లగ్జరీ విభాగంలో.. ముఖ్యంగా అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు (హెచ్ఎన్ఐ), నాన్ రెసిడెంట్ ఇండియన్(ఎన్నారై)ల నుంచి బలమైన వృద్ధిని ఆశించే అవకాశం ఉంది.

ఇండియా సోతేబీస్ ఇంటర్నేషనల్ రియల్టీ అంచనా ప్రకారం వచ్చే రెండేళ్లలో మెట్రో నగరాలు, హాలిడే డెస్టినేషన్లలో 75 శాతం మంది హెచ్ఎన్ఐలు ప్రాపర్టీ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కరోనా తర్వాత విలాసవంతమైన ఇంటి ప్రాముఖ్యతను గుర్తించడం వల్ల లగ్జరీ ఇంటిని ఎంపిక చేసుకునే హెచ్ఎన్ఐ, ఎన్నారైలు పెరుగుతున్నారు. ప్రైవేటు గార్డెన్లు, స్విమింగ్ పూల్స్, విలాసవంతమైన ఇంటీరియర్లు, విశాలమైన ఖాలీ స్థలాలు, పచ్చని ప్రాంతం వంటి అంశాలు కలిగిన లగ్జరీ ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇక హెచ్ఎన్ఐలు, ఎన్నారైలు లగ్జరీ హౌసింగ్ విభాగంలో పెట్టుబడులు పెట్టే సమయంలో కొన్ని అంశాలు చూస్తున్నారు. అవేంటంటే..

వెల్ నెస్ సౌకర్యాలు..

లగ్జరీ హౌసింగ్ సెగ్మెంట్ నిర్దిష్ట తరగతి కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నందున స్థిరమైన బ్రాండ్లకు ప్రాధాన్యత పెరిగింది. ఫలితంగా చాలామంది డెవలపర్లు కొనుగోలుదారుల ప్రాధాన్యతలను బట్టి వ్యవహరిస్తున్నారు. హెచ్ఎన్ఐలు, ఎన్నారైలు ప్రాజెక్టుల్లో ఉన్నతమైన వెల్ నెస్ సౌకర్యాలతోపాటు సహజసిద్ధమైన వెలుతురు, వెంటిలేషన్, గ్రీన్ స్పేస్, ఓపెన్ ల్యాండ్ స్కేప్ వంటి ఫీచర్ల కోసం చూస్తున్నారు. ఇలాంటి విషయాల్లో రాజీపడకూడదని హెచ్ఎన్ఐలు, ఎన్నారైలు బలంగా కోరుకుంటున్నారు.

బలమైన మౌలిక సదుపాయాలు..

లగ్జరీ హౌసింగ్ యూనిట్లలో పెట్టుబడులు పెట్టే హెచ్ఎన్ఐలు, ఎన్నారైలు బలమైన, నిర్వహించదగిన మౌలిక సదుపాయాల కోసం చూస్తున్నారు. లోపల అన్ని సౌకర్యాలతోపాటు కచ్చితమైన ప్యాంట్రీ స్థలం, ఫైర్ ప్లేస్ స్థలానికి ప్రాధాన్యత ఇవ్వడం, అలాగే మన్నికైన, సులభంగ నిర్వహించగలిగే మౌలిక సదుపాయాలు లగ్జరీ హౌసింగ్ యూనిట్లలో ఉంటాయని భావిస్తున్నారు. ఇవే లగ్జరీ హౌసింగ్ యూనిట్ ను అందుబాటు ధర ప్రాజెక్టులకు భిన్నంగా నిలబెట్టాయి. కరోనా తర్వాత ఉద్యోగులంతా తిరిగి కార్యాలయాలకు రావడం ప్రారంభించినప్పటికీ, చాలా సంస్థలు హైబ్రిడ్ మోడ్కు మారుతున్నాయి. ఫలితంగా డెవలపర్లు డిజైన్ లో భాగంగా హోం ఆఫీసును చేర్చడం తప్పనిసరి అయింది. కొనుగోలుదారులు అద్దె ఆదాయం కోసం పెట్టుబడి పెట్టాలనుకున్నప్పటికీ, హోం ఆఫీసు అనేది లగ్జరీ యూనిట్ లో అంతర్భాగంగా మారిపోయింది. హాలిడే హోమ్ లు, లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులకు కొనుగోలుదారుల నుంచి చక్కని స్పందన ఉండాలనే ఇది తప్పనిసరి.

సర్వీస్డ్ అపార్ట్ మెంట్లు..

సర్వీసెస్ అపార్ట్ మెంట్ల భావన లగ్జరీ హౌసింగ్ కొనుగోలుదారుల్లో.. ముఖ్యంగా హాలిడే హోమ్స్ సెగ్మెంట్ లో ప్రసిద్ధి చెందింది. హౌస్ కీపింగ్, ఇతర ప్రీమియం సేవల వంటి సౌకర్యాలతో రెండో ఇల్లుగా చూసే లగ్జరీ హోమ్ కొనుగోలుదారులకు ఇది మంచి ఎంపిక. మెరుగైన జీవన నాణ్యత, పెరిగిన సౌలభ్యంతో చాలామంది లగ్జరీ గృహ కొనుగోలుదారులు సర్వీస్డ్ అపార్టమెంట్లను ఇష్టపడతారు.

సీనియర్ జీవన సౌకర్యాలు..

సీనియర్ సిటిజన్లను దృష్టిలో ఉంచుకుని అనేక ప్రాజెక్టులను రూపొందించారు. డిజైన్ నుంచి సౌకర్యాల వరకు ఈ ప్రాజెక్టులు సీనియర్ సిటిజన్లకు మెరుగైన జీవన ప్రమాణాన్ని అందిస్తాయి. ఫలితంగా ఈ సెగ్మెంట్ నుంచి కొనుగోలుదారులు తమ కొత్త గృహాల కోసం చూస్తున్నప్పుడు ఈ లగ్జరీ గృహాల ఎంపికవైపు ఆకర్షితులవుతున్నారు.

శక్తివంతమైన సంఘం..

హెచ్ఎన్ఐ, ఎన్నారై కొనుగోలుదారులు సమాజంలో తమ స్థితిగతులు అంతే ఉన్నతంగా ఉండాలని కోరుకుంటారు. భావసారూప్యత కలిగిన వ్యక్తులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు. ఈ నేపథ్యంలో ఉల్లాసమైన జీవనశైలిని అందించే శక్తివంతమైన కమ్యూనిటికి అవకాశం ఉండేలా తగిన అంశాలను డెవలపర్లు తీర్చిదిద్దుతున్నారు. గ్రాండ్ క్లబ్ లు, ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లు, టాప్ ఆఫ్ ది లై స్పోర్ట్స్ సౌకర్యాలు, వెల్ నెస్ వసతుల వంటి ఫీచర్లు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి కోవిడ్ మహమ్మారి కొనుగోలుదారుల ప్రాధాన్యాలు, అంచనాలను మార్చిందని అటు కొనుగోలుదారులు, ఇటు డెవలపర్లు ఇద్దరూ గ్రహించారు. ప్రపంచం తిరిగి దాని సంప్రదాయ స్వభావానికి తిరిగి వచ్చినా ఇది కొనసాగుతుందని భావిస్తున్నారు. ఫలితంగా రియల్ పరిశ్రమ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుత ప్రాధాన్యతల ప్రకారం ప్రాజెక్టులను అందిస్తోంది.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles