Categories: LATEST UPDATES

ఓసీ కావాలా?

రాష్ట్రంలోని 13 కార్పొరేషన్లు, 128 మున్సిపాలిటీలలో.. 200 నుంచి 500 చదరపు మీటర్ల విస్తీర్ణంలోపు ఇండ్లను కట్టుకునేవారు.. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం.. 200 నుంచి 500 చదరపు మీటర్లలోపు ఇళ్లను కట్టుకునేవారు.. స్వీయ ధృవీకరణ పత్రం స్థానిక సంస్థకు సమర్పిస్తే సరిపోతుంది. దాన్ని ఆధారంగా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ మంజూరు చేస్తారు. అయితే, ప్రతి ఇంటి యజమానికి ఈ పత్రంలో ఐదు అంశాల్ని పొందుపర్చాల్సి ఉంటుంది. అవేమిటంటే..

నిబంధనల మేరకే ఇంటి చుట్టూ ఖాళీ (సెట్ బ్యాక్) స్థలాన్ని వదిలిపెట్టారా? నిర్మాణం ఎత్తు, అందులో ఎన్ని అంతస్తుల్ని నిర్మించారు? అట్టి నిర్మాణాన్నిదేనికి వినియోగిస్తారో స్పష్టంగా పేర్కొనాలి. అంటే, ఆయా కట్టడాన్ని నివసించడానికే వాడతారా? లేక వాణిజ్యఅవసరాల నిమిత్తం వినియోగిస్తారా? అనే అంశాన్ని స్పష్టంగా తెలియజేయాలి. పార్కింగ్ కోసం ఎంత స్థలాన్ని వదిలిపెట్టారు? ఇలా ప్రతి అంశాన్ని వాస్తవికంగా తెలియజేయాలి. ఇవన్నీ పక్కాగా ఉన్నట్లు నిర్థారణ అయితేనే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ని మంజూరు చేస్తారు. కాకపోతే, ఆ ఇంటిని నిబంధనలకు విరుద్ధంగా కట్టారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే మాత్రం.. స్థానిక సంస్థలు భారీ జరిమానాను విధిస్తాయనే విషయం మర్చిపోవద్దు. అంటే, ఒకవైపు నిబంధనలకు అనుగుణంగా కట్టేవారిని ప్రోత్సహిస్తూనే, నిబంధనల్ని ఉల్లంఘిస్తే అంతే కఠినంగా శిక్షిస్తామనే రీతిలో మున్సిపల్ చట్టాన్ని పొందుపరిచారు.

This website uses cookies.