హైదరాబాద్ వాణిజ్య మార్కెట్ అదరగొట్టింది. 2020 నుంచి అద్భుతమైన పనితీరు కనబరిచింది. ఆఫీస్ లావాదేవీలపరంగా దూసుకెళుతోంది. 2024లో 17 వార్షిక వృద్ధి నమోదు చేసింది. అలాగే కొత్త ఆఫీస్ స్పేస్ జోడింపులోనూ ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ మేరకు వివరాలను నైట్ ఫ్రాంక్ ఇండియా తన తాజా నివేదికలో వెల్లడించింది.
హైదరాబాద్ లో అసాధారణమైన జీవన నాణ్యతతో పాటు అత్యాధునిక మౌలిక సదుపాయాలు సహా పలు అంశాలు ఈ వృద్ధికి దోహదం చేశాయని.. ఫలితంగా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను నగరం ఆకర్షించిందని పేర్కొంది. హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ కూడా 12 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2024లో 36,974 యూనిట్లను విక్రయించింది. బలమైన ఆర్థిక మూలాధారాలు, మౌలిక సదుపాయాల పురోగతి కారణంగా 2024లో నగరం ఆల్-టైమ్ హై సేల్స్ సాధించింది. అయితే, కొత్త రెసిడెన్షియల్ లాంచ్‌లు మాత్రం 6 శాతం క్షీణించాయి. 2024లో 44,013 యూనిట్ల సరఫరా మాత్రమే నమోదైంది. మరోవైపు ఇళ్ల ధరలు మాత్రం సగటున 8 శాతం పెరిగాయి.
2024లో హైదరాబాద్‌లో ఆఫీస్ లావాదేవీలు 17% వృద్ధిని సాధించాయి. మొత్తం 10.3 మిలియన్ చదరపు అడుగుల లావాదేవీలు నమోదయ్యాయి. కొత్త స్పేస్ 139 శాతం పెరుగుదలతో ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకోవడం విశేషం. కొత్త సరఫరా 15.6 మిలియన్లతో చదరపు అడుగులుగా నమోదై అదరగొట్టింది. మరోవైపు గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు కూడా చక్కని పనితీరు కనబరిచాయి. మొత్తం లావాదేవీల్లో జీసీసీల వాటా 49శాతంగా ఉంది. 2024లో లీజుకు తీసుకున్న మొత్తం ఆఫీస్ స్పేసులో జీసీసీల వాటా 9శాతంగా ఉంది. ఫ్లెక్స్ స్పేస్ ఆపరేటర్ల లావాదేవీల వాటా కూడా గణనీయంగా 79 శాతం వృద్ధిని సాధించింది. మరోవైపు కొత్త స్పేస్ అందుబాటులోకి రావడంతో ఖాళీ స్పేస్ కాస్త పెరిగింది. 2023లో ఇది 14.9 శాతం ఉండగా.. 2024లో 18.3 శాతానికి పెరిగింది. అయితే, హైటెక్ సిటీ వంటి అధిక డిమాండ్ ప్రాంతంలో ఖాళీ స్పేస్ 10 శాతం కంటే తక్కువే ఉంది. 2024లో మొత్తం లీజింగ్‌లో 77 శాతం వాటాతో హైటెక్ సిటీ అగ్రస్థానంలో ఉంది. లావాదేవీలను పరిశీలిస్తే హైదరాబాద్ జీసీసీలకు ప్రాధాన్యత కలిగిన ప్రదేశంగా కొనసాగుతోందని, ఎంఎన్ సీలకు కూడా నగరం మరింత ఆకర్షణీయంగా మారుతోందని నైట్ ఫ్రాంక్ ఇండియా నేషనల్ డైరెక్టర్ జోసెఫ్ తిలక్ పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ 2024లో 36,974 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి చరిత్ర సృష్టించింది. 2023తో పోలిస్తే 12 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. అయితే, హైడ్రా రంగంలోకి దిగిన తర్వాత కొత్త లాంచ్ లలో 6 శాతం తగ్గాయి. గతేడాది 44,013 యూనిట్లు మాత్రమే లాంచ్ అయ్యాయి. ఇక ధరల్లో మాత్రం సగటున 8 శాతం పెరుగుదల కనిపించింది. నగరంలో సగటు ధర చదరపు అడుగుకు రూ.5,974గా నమోదైంది. అత్యధికంగా ఎల్ బీ నగర్ లో 11 శాతం (రూ.7307) పెరుగుదల కనిపించగా.. కొంపల్లిలో 10 శాతం(రూ.6220) పెరుగుదల నమోదైంది.
This website uses cookies.