తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్తోంది. ప్రస్తుతం 176 బిలియన్ డాలర్ల జీఎస్ డీపీతో ఉన్న మన రాష్ట్రం.. 2036 నాటికి లక్ష కోట్ల డాలర్ల ఎకానమీగా మారనుందని అంచనా. దేశ జీడీపీలో ఇది 10 శాతం కావడం గమనార్హం. రాష్ట్రంలో 4,160 డాలర్ల తలసరి ఆదాయంతో ఆర్థిక వృద్ధి రేటు 11.3 శాతంగా ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇదే అధికం. అలాగే రాష్ట్రంలో 66 శాతం పని చేసే వయసున్న జనాభా ఉంది. మన యువత ఉపాధి అవకాశాల ఆకర్షణలో బాగా రాణిస్తున్నారు.
ఐటీ, వృత్తిపరమైన సేవల ద్వారా తృతీయ రంగం 65.7 శాతంతో ఆధిపత్యం చెలాయిస్తుండగా.. వ్యవసాయ అనుబంధ రంగాలతో కూడిన ప్రాథమిక రంగం 21.7 శాతం, క్యారీయింగ్, తయారీతో కూడిన సెకండరీ సెక్టార్ 17.3 శాతం వాటాతో ఉన్నాయి. ఫార్మాస్యూటికల్స్, ఆర్గానిక్ కెమికల్స్, టెక్ ఉత్పత్తులపై దృష్టి సారించిన తెలంగాణ.. ఎగుమతుల్లో జీడీపీలో 25% వాటాను కలిగి ఉంది. ఏఐ ఆధారిత పాలన, స్మార్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టలు, టార్గెటెడ్ స్కిల్ డెవలప్‌మెంట్ వంటి ఆవిష్కరణలతో రాష్ట్రం వేగవంతమైన పారిశ్రామిక, ఆర్థిక విస్తరణకు సిద్ధంగా ఉంది. భారతదేశ వృద్ధిలో కీలకమైన స్థానంలో తెలంగాణ ఉంది.
This website uses cookies.