Categories: Celebrity Homes

ఇల్లు కట్టుకోవాలంటే హైదరాబాదే

  • ఈ నగరాన్ని మించింది మరెక్కడా లేదు
  • రియల్ ఎస్టేట్ గురుతో పలాస 1978 దర్శకుడు కరుణకుమార్

ప్రస్తుత శతాబ్దంలో అతి సాధారణంగా ఉండే వ్యక్తులను కనుగొనడం చాలా కష్టం. కానీ మేం ఒకరిని కనుగొన్నాం. ఆయన ఆవేశపూరిత లేదా వేధించే వ్యక్తి ఎంత మాత్రం కాదు. సింప్లిసిటీని నమ్మే వ్యక్తి. ఆయనే తెలుగు సినిమా దర్శకుడు కరుణ కుమార్. పలాస 1978 ఫేమ్ కరుణ.. సాధారణంగా, ప్రశాంతంగా ఉండటాన్నే ఇష్టపడతారు. తన కలల ఇల్లు కూడా అలాగే ఉండాలన్నది ఆయన అభిమతం. శాంతిని కలిగించే అంశాలు తన ఇంట్లో ఉండాలని కోరుకుంటారు. తన కలల ఇల్లు తనకు అత్యంత సేద తీరేదిగా ఉండాలని చెప్పారు. ‘నేనింకా నా కలల ఇంటిని నిర్మించుకోలేదు. కానీ నాకు కొంత భూమి ఉంది. త్వరలోనే నా కలల సౌధాన్ని నిర్మించుకునే దిశగా ముందుకెళ్తున్నాను. కానీ నా మొదటి మరపురాని ఇంటిని చూడాలంటే మా ఊరు వెళ్లాల్సిందే. అది చాలా చిన్న గుడిసె. భారీ పచ్చికబయలు, విశాల హృదయం కలిగిన ప్రజలు అక్కడ కనిపిస్తారు. మనుషుల సంగతి అలా ఉంచితే, మాకు పెద్ద సంఖ్యలో ఆవులు, గేదెలు ఉండేవి. ఆ సమయంలో వాటిని సంరక్షించడం చాలా పెద్ద బాద్యత. మా చుట్టూ చాలా పంటలతో పచ్చదనం నిండి ఉంటుంది. నేను రాత్రివేళ మా నాన్నతో కలిసి ఆరుబయట పడుకుని నక్షత్రాలను చూస్తూ, కూనిరాగాలు తీస్తూ నిద్రపోయేవాడిని’ అని నాటి సంగతులు గుర్తు చేసుకున్నారు.

శ్రీదేవి సోడా సెంటర్ సినిమాతో మరో హిట్ కొట్టిన కరుణ.. ఎప్పుడూ అతి సాధారణంగా ఉండటాన్నే కోరుకుంటారు. అదే ఆయన జీవనశైలిగా మారిపోయింది. తన ఇల్లు కూడా అలాగే ఉండాలని భావిస్తున్నట్టు చెప్పారు. ‘అవసరమైన సౌకర్యాలతో కూడిన స్మార్ట్, క్లీన్ గా నా ఇల్లుండాలి. నా వరకు 4 బీహెచ్ కే ఇంటికి ప్రాధాన్యత ఇస్తాను. విలాసవంతమైన డెకర్ ఉండాలని నేనెప్పుడూ కోరుకోను. దాని బదులు కళాత్మకంగా ఉండాలని భావిస్తాను. మీకు అవసరమైన, మీరు ఉపయోగించే, ప్రేమించే వస్తువులు మాత్రమే మీ చుట్టూ ఉండాలి. ఇవి కాకుండా అదనంగా ఉండేవాటిని తీసేయాలి’ అని కరుణ సూచించారు. ఈ విషయంలో ఆయన అలాగే ఉంటున్నారు. ‘ఈ ప్రపంచంలో ఉన్న డబ్బంతా నా దగ్గర ఉన్నప్పటికీ, నేను అన్నింనీ కళాత్మకంగా చేస్తాను. ఇక నాకు పచ్చికబయలు అంటే చాలా ఇష్టం. సరదాగా చిట్ చాట్ చేయడానికి అందమైన తోట ఉంటే ఎంత బాగుంటుంది? అలాగే నా తెలుగు సినిమా ఇండస్ట్రీ స్నేహితులను పిలిచి, అప్పుడప్పుడూ డ్యాన్స్ చేయడానికి ఓ గిగ్ ఏరియా ఉండాలి. నా ఇంటికి సంబంధించి అద్భుతమైన అనుభూతిని ఇచ్చేవి ఇవే. సరైన కళాత్మక ఖండాలను వినియోగించడం ద్వారా నా వ్యక్తిగత ప్రాముఖ్యత ఏమిటనేది తెలియజేయవచ్చు’ అని వివరించారు.

మీరు కోరుకునే జీవితం పట్ల సరైన దృక్పథం ఉండి, ప్రధాన విలువలు పాటిస్తే.. ఏ వస్తువులు ఉంచలి, వేటిని తీసేయాలి అనే అంశాలపై మీకు స్పష్టత వస్తుందని.. తన భవిష్యత్ ఇంటి విషయంలో ఇదే అనుసరిస్తానని ఆయన చెప్పారు. ‘నా హృదయానికి దగ్గరగా ఉండేదాన్ని నిర్మించేటప్పుడు కష్టాన్ని సృష్టించాలనుకోను. నా హాలులో పెద్ద పియానాతో శాంతి, సానుకూలత, విశాలమైన సిట్టింగ్ ప్రాంతం, బోలెడు ఇండోర్ మొక్కలు, హోం థియేటర్ సిస్టం ఉంటే బాగుంటుంది. నా గురించి మీకు ఎవరికీ తెలియని విషయం ఒకటి చెప్పనా? నాకు వంట చేయడం చాలా ఇష్టం. అందువల్ల మాడ్యులర్ కిచెన్ కు ప్రాధాన్యత ఇస్తాను. వాష్ రూం విషయానికి వస్తే.. నాకు చిన్నప్పటి నుంచి అత్యాశ ఎక్కువ. అందుకే నా బాత్ రూంలు కూడా పెద్దగా, అన్ని సౌక్యాలతో ఉండాలని కోరుకుంటాను. నా సినిమా కథలన్నీ పుట్టేవి అక్కడే. ఇక సిట్టింగ్ ఏరియా తగినంత విశాలంగా ఉండాలి. ఎందుకంటే నా కథలన్నీ చెప్పేది అక్కడే. అంతేకాకుండా కొత్తగా విడుదలయ్యే అన్ని సినిమాల గురించి అక్కడి నుంచే తెలుసుకుంటాను’ అని తెలిపారు.

సాధ్యమైనంత తక్కువ వస్తువులతో జీవించాలని, డైరెక్టర్ విషయానికి వస్తే పనికిరాని వాటిని తొలగించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాలుగా ఉపయోగించని వస్తువులు ఏమైనా ఉంటే వెంటనే వాటిని వదిలించుకోవాలని సూచించారు. ఇంట్లో ఉండే ప్రతి వస్తువుకూ ఏదో ఒకవిధంగా ఉపయోగపడేది అయి ఉండాలని.. అది సౌందర్యపరంగా లేదా భావోద్వేగపరంగా లేదా క్రియాత్మకంగా ఏదో ఒక ఉద్దేశం కలిగి ఉండాలని స్పష్టం చేశారు.
తన కలల ఇల్లు నిర్మించుకోవడానికి హైదరాబాద్ ను మించిన మరో ప్రదేశం లేదని కరుణ తేల్చిచెప్పారు. సరైన గాలి వెలుతురు, ఆహ్లాదకరమైన గోడ రంగులు, చక్కని ఫ్లోరింగ్, విశాలమైన వాష్ రూం, గాలి బాగా వచ్చే డ్రాయింగ్ రూం, అన్ని సౌకర్యాలతో కూడిన బెడ్ రూం ఉండాలన్నదే తన అభిప్రాయమని వెల్లడించారు. ‘ఇక వ్యక్తిగతమైన అభీష్టం మేరకు నాకు మాత్రమే ప్రత్యేక అర్థాన్నిచ్చే వస్తువులు ఉపయోగిస్తాను. లేదా కళాత్మకమైన ఫ్రేమ్ లు, కుటుంబ సభ్యుల ఫొటోలు ఏర్పాటు చేస్తాను. అలాగే పుస్తకాలు, కొవ్వొత్తుల వంటి రోజువారీ వస్తువులను కూడా ఆకర్షణీయంగా ఏర్పాటు చేసుకుంటా. అవన్నీ నాకు ఎంతో ఆహ్లాదకరమైన అనుభూతినిస్తాయి’ అని పేర్కొన్నారు. సాధారణంగా ఇవన్నీ స్వయంగా చేయాలనుకుంటన్నట్టు చెప్పారు. ఇప్పటివరకు తనకు ఏ సెలబ్రిటీ ఇల్లూ ఆకట్టుకోలేదని, కానీ తన స్నేహితుడు నిమ్మకాయల ప్రసాద్ ఇల్లు బాగా నచ్చిందని తెలిపారు. ఆయన ఇంట్లో ఫర్నిచర్ చాలా బాగా ఆకట్టుకుందన్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు కానీ, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏదీ అభివృద్ధి చెందనంత వేగంగా అభివృద్ధి చెందుతుందని కరుణకుమార్ అభిప్రాయపడ్డారు. చాలా కొద్దికాలంలోనే ఆసియాలోనే అగ్రశ్రేణి నగరంగా హైదరాబాద్ మారుతుందని పేర్కొన్నారు. ఇక్కడ చాలా భూమి అందుబాటులో ఉందని.. హైదరాబాద్ మాత్రమే మరింతగా అభివృద్ధి చెందుతుందని చెప్పి ముగించారు.

This website uses cookies.