Categories: LATEST UPDATES

జగనన్న సంపూర్ణ గృహ హక్కు షురూ

ఏపీలో జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. ఈ పథకం కింద దాదాపు 52 లక్షల మందికి తమ గృహాలపై సంపూర్ణ హక్కులు సంక్రమిస్తాయి. వన్ టైమ్ సెటిల్ మెంట్ పేరుతో మొదలుపెట్టిన ఈ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. గత ప్రభుత్వాలు ఇళ్ల నిర్మాణం కోసం మంజూరు చేసిన రుణాలు, వడ్డీ మొత్తాన్ని కనీస మొత్తం చెల్లించడం ద్వారా మాఫీ చేయించుకోవాలని పేర్కొంటూ ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చింది. ఈ ఇళ్లలో కొన్నింటి విలువ రూ.20 లక్షల వరకు కూడా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్దేశించిన కనీస మొత్తాన్ని(రూ.10వేలు) చెల్లించి ఇళ్లపై సంపూర్ణ హక్కులు పొందాలని సూచించింది. ‘వివిధ పథకాల కింద ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన ఇళ్లపై సంపూర్ణ  హక్కులు పొందేందుకు ఓటీఎస్ పథకం ఉపయోగపడుతుంది’ అని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పథకం కింద ప్రభుత్వం దాదాపు 40 లక్షల మంది లబ్ధిదారులకు చెందిన రూ.10వేల కోట్ల మొత్తాన్ని మాఫీ చేస్తున్నట్టు ప్రకటించింది.

This website uses cookies.