భవన నిర్మాణ రంగంలో రెండు దశాబ్ధాలకు పైగా అనుభవం ఉండి, ఇప్పటికే 15కు పైగా వెంచర్లు విజయవంతంగా పూర్తిచేసిన ‘పారిజాత హోమ్స్ అండ్ డెవలపర్స్’ సంస్థ వినియోగదారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. ఒలింపిక్స్ క్రీడల్లో మూడుసార్లు భారత హాకీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన పద్మశ్రీ ముఖేష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్‌కుమార్, టీఆర్ఎస్ నాయకుడు మన్నె గోవర్ధన్‌రెడ్డి, తదితరులతో కలిసి ఆయన పారిజాత సంస్థ కొత్తగా నిర్మిస్తున్న మూడు వెంచర్ల బ్రోచర్లను సోమవారం విడుదల చేశారు.
సాఫ్ట్‌వేర్ సంస్థలకు సరికొత్త నెలవుగా మారిన ఆదిభట్లలో ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ టీసీఎస్ పక్కన, వండర్‌లాకు అత్యంత సమీపంలో, ఔటర్ రింగురోడ్డు ఎదురుగా పారిజాత ప్రైమ్ అనే వెంచర్ ప్రారంభమైంది. ఇందులో 900 ఫ్లాట్లు వస్తాయి. ఇప్పటికే పని ప్రారంభం కావడంతో పాటు దీనికి హెచ్ఎండీఏ అనుమతి కూడా లభించింది. మరో రెండేళ్లలో ఇక్కడి ఫ్లాట్లు అందుబాటులోకి వస్తాయి. రెండో వెంచర్ బాచారం ప్రాంతంలో ప్రారంభమైంది. ఇందులో ఒక వాణిజ్య భవనంతో పాటు 390 ఫ్లాట్లు ఉంటాయి. ఇది ఔటర్ రింగురోడ్డులో తారామతిపేట ఎగ్జిట్‌కు అత్యంత సమీపంలో ఉంటుంది. ఇది కూడా రెండేళ్లలో అందుబాటులోకి వస్తుంది.
షామీర్‌పేటలోని లియోనియా పక్కన 20 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 12 టవర్లతో కూడిన పారిజాత ఐకాన్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇందులో మొత్తం 1500 ఫ్లాట్లు, రెండు క్లబ్‌హౌస్‌లు వస్తాయి. ఈ పనులన్నీ పూర్తయ్యేందుకు మూడున్నరేళ్ల సమయం పడుతుంది. ఈ మూడు వెంచర్లకూ హెచ్ఎండీఏ నుంచి అన్ని అనుమతులూ ఉన్నాయి. 1100 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2 బీహెచ్‌కే ఫ్లాట్లు, 1650 చదరపు అడుగులతో 3 బీహెచ్‌కే ఫ్లాట్లు ఈ మూడు వెంచర్లలో ఉండనున్నాయి.
సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఎస్ఎఫ్‌టీ ధరను కేవలం రూ.3,500గా మాత్రమే నిర్ణయించినట్లు పారిజాత హోమ్స్ అండ్ డెవలపర్స్ సంస్థ ఛైర్మన్ తాటిపాముల అంజయ్య తెలిపారు. తమ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నరేష్ కుమార్, డైరెక్టర్ శ్రీధర్ అంకితభావంతో పనిచేస్తూ, సరైన సమయానికి ఈ ఫ్లాట్లను వినియోగదారులకు అందించేలా చూస్తున్నట్లు ఆయన చెప్పారు. 2002లో ప్రారంభమైన పారిజాత సంస్థ కేవలం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కాక, ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, భీమవరం ప్రాంతాల్లోనూ కొన్ని వెంచర్లు చేసింది. అన్నీ కలిపి ఇప్పటివరకూ 15 వెంచర్లను విజయవంతంగా పూర్తిచేసి, కొనుగోలుదారులకు అందించింది. బ్రోచర్ల ఆవిష్కరణ కార్యక్రమం హిరణ్య ఈవెంట్ ప్లానర్స్ ఆధ్వర్యంలో రక్షారెడ్డి నిర్వహించారు.
This website uses cookies.