Categories: LEGAL

రూ.5 కోట్లు చెల్లించండి

  • ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ ఆదేశం
  • మడ అడవులను ధ్వంసం చేసినందుకు జరిమానా

భూములు లేని పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు కాకినాడ జిల్లాలోని తీరప్రాంతాలోల సుమారు 18 ఎకరాల మడ అడువులను ధ్వంసం చేసిన కేసులో ఏపీ ప్రభుత్వానన్ జాతీయ హరిత ట్రిబ్యునల్ దోషిగా నిర్ధారించింది. ఈ నేపథ్యంలో మడ అడవులకు జరిగిన నష్టానికి మధ్యంతర పరిహారంగా రూ.5 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ కె.రామకృష్ణన్, డాక్టర్ కొర్లపాటి సత్యగోపాల్ తో కూడిన ఎన్జీటీ (దక్షిణ జోన్) బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తాన్ని ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్ మెంట్ అథారిటీ వద్ద జమ చేయాలని సూచించింది. వారు ఆ సొమ్మును తీర ప్రాంతంలో ఉన్న మడ అడవుల పునరుద్ధరణ, రక్షణ, పరిరక్షణ కోసం వినియోగించాలని పేర్కొంది. పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ 2020 మార్చిలో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం.. ఈ మేరకు తీర్పు వెలువరించింది.

నవరత్నాలు.. పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఏపీ ప్రభుత్వం భూమి లేని ప్రతి పేద కుటుంబానికి ఒక సెంటు భూమి కేటాయిస్తుంది. ఈ నేపథ్యంలో కాకినాడ తీర ప్రాంతాల్లో 116 ఎకరాల్లో విస్తరించి ఉన్న మడ అడవుల్లోని 58 ఎకరాలను గుర్తించి, పంపిణీ చేయడానికి ఏర్పాట్లు ప్రారంభించింది. 2020 మార్చిలో అధికారులు ఆ స్థలాన్ని చదును చేయడం మొదలు పెట్టడంతో దీనిపై సత్యానారాయణ ఎన్జీటీని ఆశ్రయించారు.

విచారణ జరిపిన ట్రిబ్యునల్.. ఆరుగురు సభ్యులతో కమిటీని నియమించి నివేదిక ఇవ్వాలని కోరింది. 2021 మార్చి 17న కమిటీ తన నివేదిక సమర్పించింది. దాదాపు 30 శాతం ప్రాంతాన్ని ధ్వంసం చేశారని.. అక్కడ టౌన్ షిప్ కొనసాగించొద్దని, మడ అడవుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో మడ అడవులకు జరిగిన నష్టంపై పరిహారం చెల్లించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఎన్జీటీ తీర్పునిచ్చింది.

This website uses cookies.