రెరా అనుమతి లేకుండా ప్లాట్లు, ఫ్లాట్లు, ఇళ్లను విక్రయించే బిల్డర్ల నుంచి గుజరాత్, మహారాష్ట్ర తరహాలో జరిమానాను వసూలు చేయాలని తెలంగాణ వినియోగదారుల ఫోరం కోరింది. శుక్రవారం మాసాబ్‌ట్యాంకులోని రెరా కార్యాలయంలో సంఘ సభ్యులు కలిసి ఛైర్మన్ సత్యనారాయణకు ఇందుకు సంబంధించిన వినతి పత్రాన్ని అందజేశారు. గుజరాత్ రాష్ట్రం జరిమానాను వసూలు చేయడానికి ఇద్దరు తహసీల్దారులను నియమించుకున్న విషయాన్ని ఫోరం గుర్తు చేసింది.
యూపీ, హర్యానా, కర్ణాటక వంటి రాష్ట్రాలు ఇదేవిధంగా పెనాల్టీని వసూలు చేస్తున్నారని తెలియజేసింది. ఈ క్రమంలో ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవాలని టీఎస్ రెరాకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఫోరం అధ్యక్షుడు పీఠం ప్రమోద్ కుమార్, ఉపాధ్యక్షుడు ఇడం చంద్రశేఖర్, జీఎస్ నవీన్ కుమార్, సెక్రటరీ డి. ప్రసాద్, ద్రోణాచారీ, ఎస్ రమేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.