Categories: TOP STORIES

న‌గ‌రానికి చేరువ‌లో నాలుగు వేలే గ‌జం!

  • కొత్త‌గూడెం చౌర‌స్తా నుంచి పోచంప‌ల్లి
    వ‌ర‌కు ఎన్నో వెంచ‌ర్లు
  • విజ‌య‌వాడ హైవేకు స‌మీపంలోనే ప్లాట్లు
  • పెట్టుబ‌డులకు మంచి అవ‌కాశం
  • ప‌క్క‌నే లాజిస్టిక్స్ పార్కుతో మ‌రింత మార్కెట్‌

కొంచెం త‌క్కువ ధ‌ర‌కే ప్లాట్లు కావాలా? భ‌విష్య‌త్తు కోసం భూమిపై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అదీ హైద‌రాబాద్ న‌గ‌రానికి చేరువలో ఉంటే బాగుంటుంద‌ని భావిస్తున్నారా? అయితే ఈ క‌థ‌నం మీకోస‌మే. మీరు వెతుకుతున్న‌ట్టే.. మీరు కోరుకుంటున్న‌ట్టే చౌక ధ‌ర‌ల‌కు ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. మ‌రి, అవి ఎక్క‌డున్నాయో తెలియాల‌ని అనుకుంటున్నారా?

హైద‌రాబాద్ కొత్త‌పేట‌లోని పండ్ల మార్కెట్‌ను తాత్కాలికంగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండ‌లంలోని బాట‌సింగారం గ్రామంలో ఏర్పాటు చేశారు. గ‌త ఏడాది తెలంగాణ ప్ర‌భుత్వం ఆ ప‌క్క‌నే 40 ఎక‌రాల విస్తీర్ణంలో లాజిస్టిక్స్ పార్కును నెల‌కొల్పింది. ఎన్నో పెద్ద పెద్ద కంపెనీల‌కు గిడ్డంగిగా, ఇత‌ర స‌దుపాయాల‌కు అడ్డాగా మారింది. ఇప్ప‌టికే ఓ కూల్‌డ్రింక్స్ కంపెనీ భారీ స్థాయిలో అక్క‌డ త‌మ సంస్థ బ్రాంచీని ఏర్పాటు చేస్తున్న‌ది. మ‌రెన్నో పెద్ద కంపెనీలు త‌మ సంస్థ‌ల ఏర్పాటు ప‌నుల‌ను ముమ్మ‌రం చేశాయి,

హైవేకు స‌మీపంలోనే..

విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారిపై ఉన్న కొత్త‌గూడెం చౌర‌స్తా నుంచి పోచంప‌ల్లి మార్గంలో త‌క్కువ ధ‌ర‌ల‌కు ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. హైవే నుంచి కేవ‌లం 1.2 కిలోమీట‌ర్ల నుంచి 3 కిలోమీట‌ర్ల ప‌రిధిలో వెంచ‌ర్లు ఏర్పాట‌య్యాయి. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండ‌లంలోని పిగ్లీపూర్ రెవెన్యూ గ్రామంతో పాటు ప్ర‌స్తుత పోచంప‌ల్లి మున్సిపాలిటీ ప‌రిధిలో 2003-04, 2004-05 సంవ‌త్స‌రాల్లో శ్రీ‌మిత్ర టౌన్‌షిప్స్‌, స్వ‌గృహ వంటి సంస్థ‌లు..

డీటీసీపీ, గ్రామ పంచాయ‌తీ అనుమ‌తుల‌తో వంద‌ల ఎక‌రాల్లో వెంచ‌ర్లు ఏర్పాటు చేశారు. ఒకే పేరుతో కాకుండా ప‌లు స‌ర్వే నంబ‌ర్ల‌లోని భూమిని ఒక్కో వెంచ‌ర్‌ను ఆరంభించారు. డెక్క‌న్ హైట్స్‌, సాయిసౌధ ఇలా ఎన్నో పేర్ల‌తో వెంచ‌ర్లు ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. అప్ప‌ట్లో న‌గ‌రానికి దూర‌మైనా వీటికి మంచి డిమాండ్ ఉన్న‌ది. ప్ర‌స్తుతం న‌గ‌రం మ‌రింత విస్త‌రించ‌డంతో ఆయా వెంచ‌ర్ల‌లో ప్లాట్లు ఇప్పుడు హాట్‌కేక్‌లుగా మారాయి. డీటీసీపీ లేఅవుట్ల‌లో ఒక్క గ‌జం రూ. 6 వేల నుంచి రూ. 10 వేల వ‌ర‌కు అందుబాటులో ఉన్నాయి. రీసేల్ కావ‌డంతో వీటిని కొనేందుకు కొంద‌రు ముందుకొస్తున్నారు. గ్రామ పంచాయ‌తీ అనుమ‌తుల‌తో ఏర్పాటు చేసిన లే అవుట్ల‌లోనూ గ‌జానికి దాదాపు రూ. 4 వేలు మొద‌లు రూ. 8 వేల ధ‌ర వ‌ర‌కు ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. తాజాగా ఎన్నో హెచ్ఎండీఏ అనుమ‌తుల‌తో వెంచ‌ర్లు ఏర్పాట‌వుతున్నాయి. అందులో గ‌జానికి రూ.13 వేల నుంచి 17 వేల వ‌ర‌కు విక్ర‌యిస్తున్నాయి.

హైద‌రాబాద్ శివారే..

విజ‌య‌వాడ జాతీయ ర‌హ‌దారిపై పెద్ద అంబ‌ర్‌పేట ఔట‌ర్ రింగ్‌రోడ్డు నుంచి కొత్త‌గూడెం (బాట‌సింగారం) చౌర‌స్తా కేవ‌లం 9 కిలోమీట‌ర్ల దూరం ఉంటుంది. నాగోల్ నుంచి కొత్త‌గూడెం చౌర‌స్తా దాదాపు 22 కిలోమీట‌ర్లు ఉంటుంది. హ‌య‌త్‌న‌గ‌ర్ నుంచి కొత్త‌గూడెం చౌర‌స్తా దాదాపు 14 కిలోమీట‌ర్లు ఉంటుంది. మ‌రో ఫేజ్‌లో హ‌య‌త్‌న‌గ‌ర్ వ‌ర‌కు మెట్రో రైలు సేవ‌లు విస్త‌రిస్తామ‌ని ఇప్ప‌టికే తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. న‌గ‌రం విస్త‌రిస్తుండ‌టంతో విజ‌య‌వాడ హైవేకు స‌మీపంలోనే ఉన్న డీటీసీపీ, జీపీ వెంచ‌ర్ల‌లో ప్లాట్ల‌కు మంచి డిమాండ్ ఏర్ప‌డింది. పెట్టుబ‌డి పెట్టేందుకు త‌క్కువ రేటులో ప్లాట్లు దొర‌క‌డ‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణం.

డీటీసీపీతో పాటు గ్రామ పంచాయ‌తీ లేఅవుట్ల వెంచ‌ర్ల ప్ర‌ధాన ర‌హ‌దారి 100 ఫీట్ల వెడ‌ల్పు నుంచి 50 ఫీట్ల వెడ‌ల్పుతో ఉన్నాయి. ఇక వెంచ‌ర్ల‌లోని మిగ‌తా రోడ్లు 40 ఫీట్లు, 33 ఫీట్ల వెడ‌ల్పుతో ఏర్పాటు చేయ‌డంతో ఇక్క‌డ ప్లాట్లు కొనుగోలుచేసేందుకు చాలామంది ఆస‌క్తి చూపుతున్నారు. వెంచ‌ర్ల‌న్నీ రామోజీ ఫిల్మ్‌సిటీ నుంచి కేవ‌లం 5 కిలోమీట‌ర్ల‌లోపే ఉన్నాయి.

మ‌రోవైపు వ‌రంగ‌ల్ హైవే, విజ‌య‌వాడ హైవేల‌ను క‌లిపే కొత్త‌గూడెం-పోచంప‌ల్లి రోడ్డు ఇప్ప‌టికే 50 ఫీట్ల వెడ‌ల్పుతో ఉండ‌గా.. ఇది మ‌రింత విస్త‌రించ‌నున్న‌ది. ఇంకో వైపు చూస్తే గౌరెల్లి నుంచి వ‌యా పోచంప‌ల్లి, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం మీదుగా ఛ‌త్తీస్‌గ‌ఢ్ వ‌ర‌కు మ‌రో హైవే ఏర్పాటుకు ఇప్ప‌టికే ప్ర‌తిపాద‌న‌లు పూర్త‌య్యాయి. రోడ్డు కోసం మార్కింగ్‌లు సైతం చేశారు. రెండు హైవేల మ‌ధ్య ప్లాట్ల‌కు మరింత మంచి భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని కొనుగోలుదారులు విశ్వ‌సిస్తున్నారు.

square yard is 4k only

మంచి డిమాండ్‌

కొత్త‌గూడం చౌర‌స్తా నుంచి పోచంప‌ల్లి రోడ్డులో పెద్ద పెద్ద వెంచ‌ర్లు ఉన్నాయి. హెచ్ఎండీఏ, డీటీసీపీ, జీపీ అనుమ‌తుల‌తో ఉన్న ప‌లు వెంచర్ల‌లో ప్లాట్లు అందుబాటు ధ‌ర‌లోనే ఉన్నాయి. ఇన్వెస్ట్‌మెంట్ కోసం చాలామంది ఇక్క‌డికే వ‌స్తున్నారు. క్లియ‌ర్ టైటిల్, విశాల‌మైన ర‌హ‌దారులు, విజ‌య‌వాడ హైవేకు ద‌గ్గ‌ర ఉండ‌టంతో చాలా మంచి డిమాండ్ ఉన్న‌ది.
– రాకేశ్‌, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి, బాట‌సింగారం

అందుబాటులో ప్లాట్లు

న‌గ‌రం బాగా విస్త‌రించ‌డంతో ఇన్వెస్ట్‌మెంట్ కోసం శివారు వైపు చూస్తున్నారు. అలాంటి వారికి కొత్త‌గూడెం చౌర‌స్తా – పోచంప‌ల్లి రోడ్డులో మంచి ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. మంచి రీసేల్ ఉన్న‌ది. వేల సంఖ్య‌లో ప్లాట్ల‌తో విశాల‌మైన ర‌హ‌దారుల‌తో భారీ వెంచ‌ర్లు ఉన్నాయి. త్వ‌ర‌ప‌డండి. బంగారు భ‌విష్య‌త్తు దిశ‌గా అడుగులు వేయండి.
– జోర్క దామోద‌ర్‌, కుంట్లూరు

This website uses cookies.