Categories: Rera

బిల్డర్ల నుంచి రూ.101 కోట్లు రికవరీ

ఫ్లాట్ కొనుగోలుదారులకు చెల్లించాల్సిన పరిహారానికి సంబంధించి బిల్డర్ల నుంచి రూ.101 కోట్లు రికవరీ చేసినట్టు మహారాష్ట్ర రెరా ప్రకటించింది. ప్రాజెక్టులను సకాలంలో డెలివరీ చేయని బిల్డర్లకు ఎప్పటికప్పుడు నోటీసులు ఇవ్వడమే కాకుండా వాటిని తరచుగా ఫాలో అప్ చేస్తూ ఆ మొత్తాన్ని రాబట్టినట్టు వివరించింది. ముంబై సిటీ, ముంబై సబర్బన్, పుణె, రాయ్ గఢ్ లలోని 118 ప్రాజెక్టుల నుంచి రూ.100.56 కోట్లు రికవరీ చేసినట్టు తెలిపింది. మొత్తం రూ.413.79 కోట్ల రికవరీ కోసం 594 వారెంట్లను జారీ చేసినట్టు వెల్లడించింది. సకాలంలో యూనిట్లను డెలివరీ చేయకపోవడం, ప్రాజెక్టులను మధ్యలో నిలిపివేయడం, నాణ్యత లేని నిర్మాణాలు చేయడం వంటి అంశాలపై సదరు కొనుగోలుదారుల ఫిర్యాదు మేరకు ఈ రికవరీ చేపట్టినట్టు పేర్కొంది.

This website uses cookies.