2020 మార్చిలో.. కొత్త ప్రాజెక్టును ఆరంభించామని లోటస్ గ్రూప్ బిల్డర్స్ నుంచి ప్రకాష్ కు ఫోన్ కాల్ వచ్చింది. ప్రభుత్వ అనుమతులన్నీ వచ్చాయని చెప్పారు. అందుకు సంబంధించిన కొన్ని పత్రాల్ని కూడా పంపించారు. అవి చూసిన ప్రకాష్ బిల్డరుకు టోకెన్ అడ్వాన్స్ చెల్లించి రెండు ప్లాట్లను బుక్ చేశారు. మార్చి 16న ప్రకాష్ సైటు చూసిన తర్వాత రూ.6 లక్షలు చెల్లించి అగ్రిమెంట్ పత్రాల మీద సంతకం చేశాడు. వీలైనంత త్వరగా రిజిస్ట్రేషన్ చేయాలని ప్రకాష్ కోరగా.. డైరెక్టర్ పని మీద వేరే నగరానికి వెళ్లారని సిబ్బంది తెలిపారు. ఆ తర్వాత ఒక్కసారిగా కరోనా సెకండ్ వేవ్ పెరిగింది. అయినప్పటికీ, ప్రకాష్ జులైలో మరికొంత సొమ్ము లోటస్ బిల్డర్స్ కు చెల్లించారు.
స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా కట్టేశారు. ఆ తర్వాత సైటు వద్దకెళ్లి బిల్డర్ ని సంప్రదించడానికి ప్రయత్నిస్తే అతని ఫోన్ నెంబర్ పని చేయడం లేదు. పైగా, ఆయా ప్రాజెక్టుకు ప్రభుత్వ అనుమతులూ రాలేవని తెలుసుకుని ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ఆతర్వాత బిల్డర్ ని నిలదీస్తే.. తొలుత సొమ్ము వెనక్కి ఇచ్చేస్తానని నమ్మకంగా చెప్పాడు. కాకపోతే, కొన్ని వారాల తర్వాత సొమ్ము చెల్లించనని వితండవాదం చేయడం ఆరంభించాడు. దీంతో, ప్రకాష్ లోటస్ గ్రూపు మీద చీటింగ్ (420), ఫోర్జరీ (476) కేసును బాద్షాపూర్ పోలీసు స్టేషన్లో నమోదు చేశారు. దీనిపై స్పందించడానికి లోటస్ గ్రూప్ అందుబాటులో లేరు.
This website uses cookies.