ప్రముఖ నటి పూజా హెగ్డే ఇల్లు చూస్తే.. ఆమె ఎవరు అనే విషయం చాలా కచ్చితంగా తెలుస్తుంది. అంతలా ఆ ఇల్లు ఆమెను ప్రతిబింబింపజేస్తుంది. పూజ ఎంతో ప్రేమతో డిజైన్ చేసుకున్న ఇల్లు.. ఒక చెరువు, అరేబియా సముద్రానికి ఎదురుగా ఎత్తైన అంతస్తులో ఉంది. ఇంటిపై ఆమెకు ఉన్న శ్రద్ధ, అభిరుచులను ఆమె ఇల్లే చెప్పేస్తుంది. ‘ఈ ఇంటిని నిర్మించడానికి నేను పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. రోలర్ కోస్టర్ లో రైడ్ లా ఎత్తులు, పల్లాలు చాలా అనుభవం అయ్యాయి. ఈ ఇంటిని నిర్మించేటపుడు నా గురించి కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను.
ఉదాహరణకు.. నా అంతరాత్మ కోరుకునే బోలెడు వస్తువులను కనుక్కున్నాను’ అని పూజ వివరించారు. లండన్ నుంచి స్ఫూర్తి పొంది నిర్మించిన పూజా ఇల్లు.. ఎన్నో సంతోషకరమైన మధుర స్మృతుల సమ్మేళనం, సౌకర్యవంతంగా ఉంటుంది. ఆ ఇంట్లో ప్రవేశించినప్పటి నుంచి లండన్ అనుభూతిని పొందుతారు. దాని పరిపూర్ణ ఆకుపచ్చని నీడ మిమ్మల్ని ఈ పాత నగరం సందులను స్ఫురణకు తెస్తుంది. ఇక టెర్రాజో ఫినిష్ ఫైర్ ప్లేస్, క్రీమ్ టెక్చర్డ్ గోడకు ఎదురుగా ఉన్న పాస్టెల్ పింక్ సోఫా, ఒకే లాగ్ నుంచి తయారుచేసిన డైనింగ్ టేబుల్ ఆహా అనిపిస్తాయి.
‘ఈ ఇంటిని ఇలా కళాత్మకంగా రూపొందిస్తన్నప్పుడు నేను ఎవరో గ్రహించాను. నా ఇష్టాలు, అయిష్టాలు రెండూ గొప్పవి. ఈ ఇల్లు నా ప్రేమ యొక్క శ్రమ నుంచి వచ్చింది. ఇక కార్పెంటర్లు, పెయింటర్లు కూడా పూజాహెగ్డే ఇంటిని వీలైనంత కళాత్మకంగా చేయడానికి మనసు పెట్టి పనిచేశారు’ అని వివరించారు. ఇక తెలివిగా రూపొందించిన ఖాళీ ప్లేసులను మరింత తెలివిగా, అందంగా పూరించడం పూజ ఇంటికి అంతులేని వన్నె తెచ్చింది. పాత భారతీయ గృహాలను, ప్రపంచంలోని అత్యుత్తమమైన వాటికి అద్దంపట్టే ఆధునిక డిజైన్ సౌందర్యాన్ని మేళవించి ఈ ఇంటిని డిజైన్ చేశారు. ఇంట్లోని అన్ని గదులూ పాస్టెల్ రంగులు, లైట్ ఫిక్చర్లు కలిగి ఉంటాయి.
ఫ్లోర్ స్పేస్ కేటాయింపులో కూడా స్పష్టమైన ఉద్దేశం కనిపిస్తుంది. మొత్తం గదిని గ్రీన్ రూమ్ గా, క్లోసెట్ వాకిన్ గా ఉపయోగించడానికి వీలుగా రూపొందించారు. ‘సృజనాత్మకత విషయానికి వస్తే.. మీరు ఈ రోజు చూస్తున్న ఇంటిని నిర్మించడానికి ఏకంగా ఓ సైన్యమే పని చేసింది. ప్రతి ఒక్క కాంట్రాక్టర్ తమ మనసును, ఆత్మను పెట్టి మరీ పనిచేశారు. నా ఇంటిని ఇతర నటీనటుల నుంచి వేరు చేసేది ఏంటంటే.. నాకు అన్నీ చాలా కచ్చితంగా ఉండాలి. ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. అందుకే వారు నన్ను కఠినమైన టాస్క్ మాస్టర్ అని పిలిచేవారు’ అని పూజ వెల్లడించారు.
తన ఇంటి తలుపు ట్రైలర్ గా ఉంటుందని, అనేక విధాలుగా నటిగా ఆమె ఎవరు అనే విషయాన్ని అది తెలియస్తుందని పూజ తెలిపారు. ‘నా దగ్గరివారు, ప్రియమైన వ్యక్తులు ఈ ద్వారం మనల్ని ఎటువైపు నడిపిస్తుందో అని ఎదురుచూస్తుంటారు. ఇది నాకు అత్యంత ఇష్టమైన రెండు నగరాలు న్యూయార్క్, లండన్ కలయికగా ఉండాలని కోరుకున్నాను. ఇది నా సురక్షితమైన స్థలం. అలాగే సంప్రదాయ ప్రదేశం కూడా’ అని చెప్పారు. ఆమె తల్లిదండ్రుల వద్ద పెరుగుతూ పండగలు చేసుకోవడం అలవాటు చేసుకున్నారు కాబట్టి, ఆమె సంప్రదాయబద్ధమైన మార్గంలోనే వెళ్తున్నారు.
ఈ బాలీవుడ్ నటి చెప్పిన మరో విషయం ఏమిటంటే.. ‘నేను బయటకు వెళ్లినప్పుడు ఒక నటిగా నా అభిమానులు నన్ను చాలా ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలని భావిస్తారు. అందువల్ల నేను కేవలం ‘నేను’గా ఉండే ఇంటిని కోరుకున్నాను. తెలుపు, చెక్క రంగులను బాగా ఇష్టపడతాను. అలంకరణ విషయంలో కామ్ గా వెళతాను. అయితే, స్త్రీ శక్తిని జోడించడానికి పింక్ సోఫా కొన్నాను’ అని తెలిపారు. ఇక వంటగది ఓపెన్ కిచెన్ కావడం వల్ల చాలా ఇష్టమని చెప్పారు. షైన్, గ్లామర్ ను మేళవించడానికి ఆమె చాలా చేశారు. ‘నాకు ఎక్స్ ఫోజ్డ్ ఫిలమెంట్ అంటే చాలా ఇష్టం. మీరు చేపలను వేపుతుంటే, ఇల్లు మొత్తం పొగలు కక్కుతుంది. ఈ సమయంలో వంటగదిని వెంటనే మూసివేయడానికి ఓ ప్యానెల్ ఏర్పాటు చేయాలనేది నా స్మార్ట్ ఐడియా’ అని వివరించారు.
పూజా హెగ్గేకు ఒక వర్క్ స్పేస్ కూడా ఉంది. ‘దానిని అందరూ చూడలేరు. నా బ్యాగులు నా విలువైన వస్తువులు. నేను క్లాసిక్ కంటే ట్రెండీగా ఉన్నాను. బెడ్ రూమ్ లో కూర్చుని నా సినిమాలు చూస్తాను. నాకు అక్కడ ప్రొజెక్టర్ సిస్టమ్ ఉంది. స్క్రీన్ పాప్ అప్ అవుతుంది. ఇక సీలింగ్ ఓ స్మారకచిహ్నం అనుభూతిని ఇస్తుంది. నేను విదేశాలలో దీనిని చూశాను. అనంతరం వాటికి బోలెడు లైట్లు జోడించాను’ అని తెలిపారు. పూజ తన కలల ఇంట్లో మరో కీలకమైన అంశమేమిటంటే.. వంటగదికి నీలం రంగు ఎంచుకోవడం. ఎందుకంటే అది అధిక శక్తిని కలిగి ఉంటుంది. ఆమె నలుపును, నీలాన్ని కలిపేశారు.
This website uses cookies.