జబల్ పూర్ నుంచి వచ్చిన తెలుగు నటి ప్రగ్యా జైశ్వాల్ కి అక్కడి ఖోయే కి జలేబీ తెలుసు.. నర్మదా నది చుట్టూ ఉన్న చారిత్రక కట్టడమూ తెలుసు. ఆమె తన యుక్త వయసు అంతా అక్కడి జలపాతాలు, సుందరమైన అందాల మధ్యే పెరిగారు. తాను ఓ స్మారక ప్రాంగణం వంటి అద్భుతమైన ఇంట్లో నివసిస్తున్నట్టు చెప్పారు. సింప్లిసిటీ పట్ల ఆమెకు మంచి అవగాహన ఉంది. ‘సున్నితమైన, అందమైన ప్రదేశాలను డిజైన్ చేయడమే మినిమలిజానికి అర్థం. నాకు విలాసవంతమైన డెకర్ ఇష్టం లేదు. క్లాసీ, సూపర్ చిక్ డ్రీమ్ హోమ్ ని డిజైన్ చేయాలన్నదే నా అభిమతం’ అని ప్రగ్యా పేర్కొన్నారు. ఆధునిక, సంప్రదాయాలలో ఎందులోనూ రాజీపడకూడదు.
ఆమె చుట్టూ ఉన్న అన్ని ఆటోమేటివ్ డిజైన్లలో ప్రగ్యా మినిమలిజం ప్రభావం కచ్చితంగా కనిపిస్తుంది. ఇలాంటి ఆర్కిటెక్చర్ డిజైన్ అందరికీ ఉండకపోవచ్చు. కానీ కంచె ఫేమ్ ప్రగ్యాకి మాత్రం ఇలాంటి ఆర్కిటెక్చరే ఉంటుంది. తొలిచూపులోనే అది బాగుంది అని ఆమెకు అనిపించకపోవచ్చు. కానీ తన కలల ఇల్లు ఎలా ఉండాలనే అంశంపై ఆమెకు చక్కని ఆకాంక్షలు, అభిప్రాయాలు ఉన్నాయి. ‘నేను మొదట పెంట్ హౌస్ ని కొనడానికి ఇష్టపడతాను. ముఖ్యంగా సముద్రంగా ఎదురుగా ఉండాలి. ఇక నా ఇంటి ఆర్కిటెక్చర్ అసాధారణంగా ఉంటుంది. భారీ కిటికీల ద్వారా బయట దృశ్యాలు స్పష్టంగా కనిపించాలి. ఇంటికి సంబంధించి నా ఆకాంక్షలన్నీ అందులో గుది గుచ్చినట్టు ఉండాలి. అలంకరణ, విలాసవంతం కంటే టెక్చర్స్, ఇతరత్రా అంశాలు ప్రతిఫలించాలి. అలాగే పెంట్ హౌస్ చుట్టూ కళాత్మక పనితనం కనిపించాలి’ అని పేర్కొన్నారు.
సెలబ్రిటీ స్నేహితుల్లో కార్లా కనుంగో ఇల్లంటే ప్రగ్యాకి చాలా ఇష్టం. ‘ఆమె ఇల్లు రూపాంతరం చెందడం నేను ప్రత్యక్షంగా చూశాను. ఇంటికి చాలా చేసింది. ఆమె తన ఇంటిని పూర్తిగా కస్టమ్ మేడ్ హోమ్ గా మార్చేసింది. నేను ఆమె ఇంటికి వెళ్లినప్పుడల్లా కార్లా ఇష్టాలు, ప్రాధాన్యతలు చూస్తాను. అద్భుతమైన కళాఖండాలు కూడా ఉంటాయి. ఇక ఆమె ఇంట్లో ఫర్నిచర్ అయితే వివిధ దేశాల నుంచి తీసుకొచ్చింది. ఇక ఆమె ఇంట్లో నుంచి సముద్ర వీక్షణం అద్భుతంగా ఉంటుంది. ఎన్నో విలాసవంతమైన ఇళ్లు ఉన్నప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్ ఇంట్లో చక్కని అనుభూతులు ఆస్వాదించడానికి మనకు ఏదో ఒకటి కనిపిస్తుంది. ఆమె స్వస్థలం నుంచి వచ్చిన కళను నా కలల సౌధంలో కూడా చేర్చాలనుకుంటున్నాను’ అని ప్రగ్యా తెలిపారు. లాస్ ఏంజిల్స్ లో ఇళ్ల నిర్మాణంలో భూమ్ ఉంటుందని, అక్కడ కొత్త ఇంటిని కట్టుకోవాలనే కోరిక ఉందని ప్రగ్యా వెల్లడించారు. అలా ఆమె హాలీవుడ్ కల సాకారం అవుతుంది.
This website uses cookies.