Categories: LATEST UPDATES

‘ప్రెస్టీజ్’ ఆదాయం.. రూ. 2,360.6 కోట్లు

2021 మార్చితో ముగిసిన త్రైమాసికంలో.. బెంగళూరుకు చెందిన ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ఏకీకృత నికర లాభం రూ. 1,336.3 కోట్లకు పెరిగింది. కొన్ని వాణిజ్య ఆస్తుల ద్వారా డబ్బు ఆర్జించడంతో నాలుగో త్రైమాసికంలో కంపెనీ 1,469.8 కోట్ల రూపాయల అసాధారణ లాభం పొందింది. 2021 నాలుగో త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ. 2,360.6 కోట్లకు పెరిగింది.

అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ. 2,016.9 కోట్లు అని సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ నికర లాభం 1,456.2 కోట్ల రూపాయలు కాగా అంతకుముందు సంవత్సరంలో ఇది రూ. 403.1 కోట్లు. ఈ ఏడాది మార్చిలో, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ బ్లాక్‌స్టోన్‌ కు 12 ఆస్తులు/సంస్థల్ని విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం విలువ.. దాదాపు రూ.9,160 కోట్ల దాకా ఉంటుంది.

This website uses cookies.