Categories: AREA PROFILE

గుంటూరులో స్థిరనివాసానికి ” సై”.. ఏయే ప్రాంతాల్లో ఫ్లాట్ల ధరలెలా

గుంటూరులో రియల్ రంగం ఒక వెలుగు వెలిగింది. అమరావతి రాజధానిని మూడు ముక్కలుగా చేయడంతో ఒక్కసారిగా ఇక్కడి మార్కెట్ నీరసించింది. బడా గేటెడ్ కమ్యూనిటీల్లో సైతం పెద్దగా కొనుగోళ్ల సందడి కనిపించడం లేదు. కాకపోతే, స్థిరనివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావించేవారికి, ఇది చక్కటి తరుణం అని చెప్పొచ్చు.

గుంటూరులో మంగళగిరి ప్రాంతానికి గల క్రేజీ అంతా ఇంతా కాదు. బడా బడా గేటెడ్ కమ్యూనిటీలన్నీ ఇక్కడ జాతీయ రహదారి మీదే కొలువుదీరాయి. రామక్రిష్ణ వెనుజియా, వర్టెక్స్ సీరిస్ సిగ్నా వంటివి ఏర్పాటయ్యాయి. గోరంట్ల, విద్యానగర్, బాపట్ల వంటి ప్రాంతాల్లోనూ సరికొత్త ఫ్లాట్లు, వ్యక్తిగత ఇళ్లను కొనుగోలు చేయవచ్చు. గుంటూరులో కనీసం పది ముఖ్యమైన ప్రాంతాల్లో ధరలు గత కొంతకాలంలో పెరిగాయి. మరికొన్ని చోట తగ్గుముఖం పట్టాయి. మరి, ఏయే ప్రాంతాల్లో ఫ్లాట్ల ధరలెలా ఉన్నాయంటే..

ప్రాంతం కనీస- గరిష్ఠ రేటు
మంగళగిరి 3100- 5200
గోరంట్ల 2800- 5000
కొప్పురావూరు 2800- 3200
విద్యానగర్ 2700- 5100
తాడేపల్లి 3700- 4500
కాజా 2600- 4600
మహత్మాగాంధి ఇన్నర్ రింగ్ 2400- 3600
పాలకాలూరు రోడ్డు 2800- 3600
గుజ్జనగుండ్ల 3000- 3400
జేకేసీ రోడ్డు 3400- 4800
నంబూరు 3500- 4000
వికాస్ నగర్ 3600- 5100
గుంటూరు- చెన్నై హైవే 2200- 3400
ఎన్ఆర్ఐ హాస్పిటల్ రోడ్ 3100- 3700
ఏపీహెచ్బీ కాలనీ 3300- 3700
అమరావతి 2900- 3200
గుంటూరు అమరావతి రోడ్డు 3200- 3400
నల్లపాడు 2300- 3200
పెద్ద పాలకూరు రోడ్డు 2200- 3200
రత్నగిరి నగర్ 3000- 3400
శ్యామలానగర్ 2800- 3600
భాగ్యనగర్ రెండో వీధి 2900- 3100
విజయపురి కాలనీ 2500- 8800
ఎస్వీఎన్ కాలనీ 3400- 3600
అశోక్ నగర్ 3600- 4300
క్రిష్ణానగర్ 4000- 4400
ఆర్టీవో ఆఫీసు రోడ్డు 2500- 3500
సాయిబాబా రోడ్డు 4000- 4200
క్రిష్ణయపాళెం రోడ్డు 4200- 4400
ఎన్టీఆర్ స్టేడియం వాకింగ్ ట్రాక్ 5900-6000

* (ధర..రూ.లలో- చ.అడుక్కీ)
* కేవలం అవగాహన కోసమే ఈ ధరలు. తుది రేటు కోసం బిల్డర్ ను సంప్రదించండి.

This website uses cookies.