HMDA Commissioner Suspended APO BV KrishnaKumar
గ్రామ పంచాయతీ లేఔట్‌లను నిషేధిత జాబితాలో చేర్చిన హెచ్‌ఎండిఏ దానికి సంబంధించిన వివరాలను పూర్తిగా తొలగించారు. ‘నిషేధిత జాబితాలో జిపి లేఅవుట్ల’ పేరుతో వెలువడిన కథనంపై ప్రభుత్వం ఆరా తీసింది. ఎవరూ హెచ్‌ఎండిఏ వెబ్‌సైట్‌లో వాటిని అప్‌లోడ్ చేశారంటూ ప్రశ్నించింది. దానికి సంబంధించిన వివరాల్ని తెలియచేయాలని ప్రభుత్వం సూచించడంతో హెచ్‌ఎండిఏ అధికారులు వెబ్‌సైట్ నుంచి 548 లే ఔట్లకు సంబంధించి జాబితాను తొలగించింది.
ఇప్పటికే ఈ జాబితాను వెబ్‌సైట్ పెట్టడంపై రియల్టర్‌లు, ప్రజలు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే హెచ్‌ఎండిఏ అధికారులు వెనక్కి తగ్గడంతో పాటు ఆ జాబితాను వెబ్‌సైట్ నుంచి తొలగించారు.
This website uses cookies.