హైడ్రాను రద్దు చేయాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్‌లకు ఎంఐఎం కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. హైడ్రాకు జీహెచ్ఎంసీతో సంబంధం లేకుండా తీర్మానం చేయాలని కోరుతూ ఏడు మంది స్టాండింగ్ సభ్యులు వినతి పత్రంలో కోరారు. జీహెచ్ఎంసీ యాక్ట్ లో హైడ్రా లేదని, హైడ్రా వింగ్ కోసం జీహెచ్ఎంసీ యంత్రాంగాన్ని వాడుతున్నారని ఎంఐఎం కార్పొరేటర్లు ఆరోపించారు. హైడ్రాను తెచ్చి జీహెచ్ఎంసీ పై రుద్దడం కరెక్టు కాదన్నారు. జీహెచ్ఎంసీ యాక్ట్ లో ఇలాంటి వ్యవస్థ లేదని, వెంటనే పాలక మండలిలో తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపాలని వారు కోరారు.
This website uses cookies.