వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల తర్వాత రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ధరల్లో గణనీయమైన పెరుగుదల ఉంటుందని నిర్మాణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాదితో పోలిస్తే వచ్చే ఏడాది మొదటి అర్థం భాగంలో 14 శాతం, తదుపరి అర్థభాగంలో 5 నుంచి 10 శాతం మేర ప్రాపర్టీ ధరలు పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం దేశంలో రియల్ ఎస్టేట్ బూమ్ ఎన్నారైలను బాగా ఆకర్షిస్తోంది. బెంగళూరు, ముంబైతో పాటు హైదరాబాద్ కు వారు ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశంలో ఎన్నారైలు ఎక్కువగా ఇళ్లను కొనుగోలు చేస్తున్నారు. నెల రోజుల్లోనే ఎన్నారై రెసిడెన్షియల్ అమ్మకాలు 11 శాతం నుంచి 15 శాతానికి పెరగడమే ఇందుకు నిదర్శనమని నో బ్రోకర్ డాట్ కామ్ పేర్కొంది. ఈ డిమాండ్ 2025 చివరి నాటికి 20 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది. గత ఏడాది కాలంగా భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ పై ఎన్నారైల ఆసక్తి బాగా పెరిగింది. కాస్మొపాలిటన్ జీవనశైలి, ప్రపంచ స్థాయి విద్యాసంస్థలు, అభివృద్ధి చెందుతున్న స్టార్టప పర్యావరణ వ్యవస్థలతో హైదరాబాద్‌లో అద్దె రాబడి గణనీయంగా పెరిగింది. దీంతో ఈ నగరం పెట్టుబడులకు మంచి గమ్యస్థానంగా మారింది. ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణల నేపథ్యంలో అస్థిర మార్కెట్ పరిస్థితులు, పెరుగుతున్న రియల్ ఎస్టేట్ ధరలు వంటి అంశాలే దుబాయ్ నుంచి బెంగళూరు, పుణె, హైదరాబాద్ వంటి నగరాల వైపు ఎన్నారైలు మొగ్గు చూపడానికి ప్రధాన కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
This website uses cookies.