దేశంలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రియల్ ఎస్టేట్ ప్లాట్ ఫారమ్ అయిన స్క్వేర్ యార్డ్స్ ఆదాయం క్యూ2లో దూసుకెల్లింది. వార్షిక ప్రాతిపదికన 60 శాతం పెరిగి రూ.225 ఆదాయం వచ్చింది. అలాగే స్థూల లావాదేవీ విలువ (జీటీవీ) 77 శాతం పెరిగి రూ.9,169 కోట్లకు చేరుకుంది. అలాగే లావాదేవీల సంఖ్య 143 శాతం మేర పెరిగి 40,757కి చేరుకున్నాయి. దీంతో 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరునెలల ఆదాయం రూ.398 కోట్లు దాటింది. ప్రస్తుతం తాము 100 మిలియన్ డాలర్ల మైలురాయిని దాటిన మొదటి ప్రాప్ టెక్ ప్లేయర్ గా మారామని.. అయినప్పటికీ ప్రతి రోజూ ఇదే తమ మొదటి రోజుగా భావిస్తామని స్క్వేర్ యార్డ్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ తనూజ్ షోరి పేర్కొన్నారు.