Categories: LATEST UPDATES

అక్టోబ‌రులో.. న‌రెడ్కో 13వ ఎడిష‌న్ ప్రాప‌ర్టీ షో

న‌రెడ్కో తెలంగాణ ప‌ద‌మూడో ఎడిష‌న్‌ ప్రాప‌ర్టీ షోను అక్టోబ‌రు 6 నుంచి 8 తేదీల్లో మాదాపూర్‌లోని హైటెక్స్‌లో నిర్వ‌హిస్తున్నామ‌ని న‌రెడ్కో తెలంగాణ అధ్య‌క్షుడు బి.సునీల్ చంద్రారెడ్డి తెలిపారు. మంగ‌ళ‌వారం న‌గ‌రంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. నిర్మాణ రంగంలో తెలంగాణ అనూహ్య‌మైన అభివృద్ధిని సాధిస్తోంద‌న్నారు. ఇత‌ర ప్ర‌ధాన న‌గ‌రాల్లో నెగ‌టివ్ లేదా సింగిల్ డిజిట్ గ్రోత్ ఉంటే.. తెలంగాణ‌లో డ‌బుల్ డిజిట్ గ్రోత్ సాధించింద‌న్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మేకా విజ‌య్ సాయి మాట్లాడుతూ.. హైద‌రాబాద్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాల‌ని భావించేవారికి.. న‌రెడ్కో ప్రాప‌ర్టీ షోలో అనేక ఆప్ష‌న్లు దొరుకుతాయ‌న్నారు. ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కోట‌క్ వంటి బ్యాంకులు గృహ‌రుణాల్ని మంజూరు చేస్తాయ‌న్నారు.

This website uses cookies.