వినుకొండలో జెనీత్ సిటీ, మేదరమెట్లలో గ్రోత్ సిటీని నిర్మించిన శ్రీ భ్రమరా టౌన్‌షిప్స్ కనిగిరి కనుమల్లో శ్రీ భ్రమరా బృందావన్ అనే ప్రాజెక్టును ప్రారంభించింది. సుమారు 52.7 ఎకరాల్లో 68 ఇండిపెండెంట్ ఇళ్లు, 24 విలాసవంతమైన విల్లాలు, 453 ఓపెన్ ప్లాట్లను శంకవరంలో డెవలప్ చేస్తోంది.
శాస్త్ర, సాంకేతిక రంగాలను అంది పుచ్చుకొని.. కనిగిరి ప్రాంత ప్రజలు.. వ్యవసాయ వ్యాపార, విద్య, ఉద్యోగ, మౌలిక వసతుల రంగాల్లో తమధైన అభివృద్ధిని సాధించారు. కనిగిరి పరిసర ప్రాంతాల గ్రామాలు, మండలాల ప్రజలు తమ దైనందిన వ్యవహారాలతో నిత్యం రాకపోకలతో పట్టణం అభివృద్ధి దిశగా దూసుకు పోతుంది. ఈ క్రమంలో హైదరాబాద్ ఏర్పేడు నేషనల్ హైవే 565.. బెంగుళూరు, రాయలసీమ కోస్తా జిల్లాలను కలుపుతూ గ్రీన్ ఫీల్డ్ హైవే.. కనిగిరి మీదుగా వెళుతుంది. కొత్తగా ఏర్పడిన గుంటూరు – గుంతకల్లు రైల్వే లైన్ రవాణా సదుపాయంతో కనిగిరి అభివృద్ధి లో కీలక పాత్ర పోషించనుంది.ఈ క్రమంలో ఆధునిక సదుపాయాలకు పెద్దపీట వేస్తూ.. ఈ టౌన్‌షిప్‌ను డెవలప్ చేస్తోంది.
This website uses cookies.