ప్రముఖ సింగర్, మ్యూజిక్ కంపోజర్ రాహుల్ కృష్ణ వైద్య ముంబైలో 3,110 చదరపు అడుగుల హై ఎండ్ అపార్ట్ మెంట్ ను రూ.9 కోట్లకు కొనుగోలు చేసినట్టు ప్రాప్‌టెక్ ప్లాట్‌ఫారమ్ స్క్వేర్ యార్డ్స్ పేర్కొంది. బాంద్రా వెస్ట్ లోని డీఎల్ హెచ్ సిగ్నేచర్ లో ఈ ప్రాపర్టీ ఉంది. 1.25 ఎకరాల స్థలంలో ఉన్న ఈ ప్రీమియం ప్రాజెక్టులో పలు సౌకర్యాలతో 3, 4, 5 బీహెచ్ కే ఫ్లాట్లు ఉన్నాయి. ఇక వైద్య కొనుగోలు చేసిన అపార్ట్ మెంట్ 317.93 చదరపు మీటర్ల (సుమారు 3,422 చదరపు అడుగులు) విస్తీర్ణంలో ఉంది.
అక్టోబర్ 2024లో జరిగిన ఈ లావాదేవీకి రూ.56.37 లక్షల స్టాంప్ డ్యూటీ, రూ.30వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. బాంద్రా వెస్ట్ అనేది పలువురు బాలీవుడ్ తారలకు నిలయంగా ఉంది. ఇక్కడ బాలీవుడ్ తారల పెట్టుబడులు అంతకంతకూ పెరుగుతున్నాయి. సునీల్ శెట్టి, రణ్వీర్ సింగ్ మరియు దీపికా పదుకొనే వంటి బాలీవుడ్ తారలు, కెఎల్ రాహుల్ వంటి క్రీడా ప్రముఖులు కూడా ఈ పరిసరాల్లో ఆస్తులు కొనుగోలు చేశారు. హై-ఎండ్ నివాసాలు, ఆధునిక సౌకర్యాలు, విమానాశ్రయం, వ్యాపార కేంద్రాలకు సులభమైన కనెక్టివిటీ ముంబైలో ప్రీమియం నివాస స్థలాలను కోరుకునే హై-ప్రొఫైల్ వ్యక్తులకు బాంద్రాను ఒక ప్రాధాన్య ఎంపికగా మార్చింది.
This website uses cookies.