Categories: LATEST UPDATES

పుణెలో భూమి కొన్న రాజీవ్ బజాజ్

  • రిషబ్ ఫ్యామిలీ ట్రస్ట్ ద్వారా రూ.72 కోట్ల భూమి కొనుగోలు
  • స్క్వేర్ యార్డ్స్ నివేదిక వెల్లడి

దివంగత రాహుల్ బజాజ్ కుమారుడు రాజీవ్ నాయన్ బజాజ్ ఓ ట్రస్టీగా ఉన్న రిషబ్ ఫ్యామిలీ ట్రస్ట్ పుణెలో ఓ భారీ భూ లావాదేవీ జరిపింది. కోరేగావ్ పార్క్ ప్రాంతంలో రూ.72 కోట్లు వెచ్చించి భూమి కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని స్క్వేర్ యార్డ్స్ తన తాజా నివేదికలో వెల్లడించింది. 4,667.3 చదరపు మీటర్లు (దాదాపు 1.15 ఎకరాలు) భూమితోపాటు ఓ బంగ్లా, అవుట్ హౌస్ ఇందులో ఉన్నాయి. మొత్తం 1,493.7 చదరపు మీటర్ల (16,079.68 చదరపు అడుగులు) బిల్టప్ ఏరియా ఉంది.

రిషబ్ ఫ్యామిలీ ట్రస్ట్ కింద రాజీవ్ నాయన్ బజాజ్ భార్య దీపా బజాజ్ సంతకం చేయడం ద్వారా ఈ కొనుగోలు జరిగింది. ఈనెలలోనే జరిగిన ఈ లావాదేవీకి స్టాంప్ డ్యూటీ కింద రూ. 5.04 కోట్లు, రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.30వేలు చెల్లించారు. విలాసవంతమైన బంగ్లాలు, అధునాతన కేఫ్‌లు, బోటిక్ దుకాణాలు, ఉన్నతమైన జీవనశైలికి కోరేగావ్ ప్రసిద్ధి చెందింది. ఇది హై-ఎండ్ రియల్ ఎస్టేట్ పెట్టుబడుల కోసం కోరుకునే గమ్యస్థానంగా మారింది. పుణె విమానాశ్రయానికి సమీపంలో ఉండటం, బలమైన కనెక్టివిటీ కలిగి ఉన్నందున ఈ ప్రాంతానికి డిమాండ్ బాగా పెరిగింది.

This website uses cookies.