Categories: PROJECT ANALYSIS

సరైన జీవితానికి సరికొత్త నిర్మాణం

  • మీరో మంచి జీవితాన్ని జీవించాలని కోరుకుంటున్నారా?
  • మీ ఇల్లు శ్రావ్యమైన సంగీత అనుభూతుల్ని మిగిల్చాలని భావిస్తున్నారా?
  • మీ ఇరుగుపొరుగుతో కలిసి ఆనందంగా జీవించాలని అనుకుంటున్నారా?
  • మీ జీవనశైలిని ప్రతిబింబించేలా.. సంపూర్ణ ఆత్మతో నివసించాలని ఆరాట పడుతున్నారా?

అయితే, మీలాంటి వారినే సాదరంగా.. సామరస్యపూర్వకంగా స్వాగతిస్తోంది.. ‘రాంకీ వన్’ హార్మోనీ @ ప్రగతి నగర్.

ప్రగతి నగర్ పేరు చెబితే చాలు.. చిన్న చిన్న అపార్టుమెంట్లు.. అందులో పెద్దగా కనిపించని సౌకర్యాలు.. నిత్యం నీటి సమస్యలు కనిపిస్తుంటాయి. కానీ, వీటికి భిన్నంగా అతిసుందరమైన గేటెడ్ కమ్యూనిటికీ రాంకీ సంస్థ అంకురార్పణ చేసింది. ప్రస్తుత జీవన విధానానికి అతికినట్లు సరిపోయే సౌకర్యాల్ని పొందుపర్చింది. ప్రాజెక్టు ఒకటే అయినప్పటికీ రెండు క్లబ్ హౌజులు, కనువిందు కలిగించే పచ్చటి పరిసరాలు, తివాచీ పర్చిన పచ్చదనం వంటివి అభివ్రుద్ధి చేస్తోంది. రెండు పడక గదుల ఆరంభ ధర.. రూ.68 లక్షలు కాగా.. 2024లో ప్రాజెక్టును సంస్థ పూర్తి చేసేందుకు ప్రణాళికల్ని రచిస్తోంది. ప్రస్తుతం రెండు బ్లాకులకు సంబంధించిన ఫుటింగ్ పనులు ఆరంభమయ్యాయి.

రాంకీ వన్ హార్మోనీ ప్రాజెక్టును సుమారు 8.1 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఏడు టవర్లలో 803 ఫ్లాట్లను కడతారు. ఒక్కో టవరును రెండు బేస్మెంట్ + జి+ 9 అంతస్తుల ఎత్తులో నిర్మిస్తారు. ఇందులో వచ్చేవన్నీ ఈస్ట్, వెస్ట్, నార్త్ ఫేసింగ్ ఫ్లాట్లే కావడం గమనార్హం. టూ బెడ్రూమ్ ఫ్లాట్లు.. 1155- 1160 చదరపు అడుగుల్లో కడతారు. రెండున్నర పడక గదుల ఫ్లాట్లను 1295 చ.అ., ట్రిపుల్ బెడ్రూం ఫ్లాట్లను 1390, 1395, 1540 చదరపు అడుగుల్లో కడతారు. ఇక, మూడున్నర పడక గదుల ఫ్లాట్లు 1585, 1595 చ.అ.ల్లో నిర్మిస్తారు.

రాంకీ సంస్థ క్లబ్ హౌజును ఎంతో వైవిధ్యంగా అభివ్రుద్ధి చేస్తుందనే నమ్మకం కొనుగోలుదారుల్లో నెలకొంది. అందుకే, దాన్ని వమ్ము చేయకుండా ఇందులోని క్లబ్ హౌజును తీర్చిదిద్దుతున్నారు. ఈసారి టెర్రస్ స్విమ్మింగ్ పూల్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. చిన్నారులకు పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టు, ఏసీ జిమ్, బిజినెస్ లాంజ్, ఇండోర్ గేమ్స్ రూమ్, అసోసియేషన్ ఆఫీస్, ఫెసిలిటీ మేనేజర్ ఆఫీస్, స్టోర్ రూమ్, స్పా, సెలూన్, క్రెష్, ఏటీఏం వంటివన్నీ ఏర్పాటు చేస్తారు.
రాంకీ వన్ హార్మోనీ ప్రధాన ఆకర్షణల్లో ప్రముఖంగా నిలుస్తాయి.. ఇందులోని సెంట్రల్ కోర్టు యార్డు, ఓపెన్ ఎయిర్ థియేటర్, ఎల్డర్స్ కమ్యూనిటీ జోన్, ఔట్ డోర్ జిమ్ వంటివని చెప్పొచ్చు. స్కూళ్లు, కాలేజీలు, ఇంజినీరింగ్ కళాశాలలు, అత్యవసరాల్లో వెళ్లేందుకు ఆస్పత్రులు వంటివన్నీ చుట్టుపక్కలే ఉన్నాయి. మాదాపూర్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో పని చేసే ఐటీ ఉద్యోగులు ప్రతి రోజూ సులువుగానే ఇక్కడ్నుంచి రాకపోకల్ని సాగించొచ్చు. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఇక్కడి చుట్టుపక్కల పని చేసే ఫార్మా ఉద్యోగులకు ఈ ప్రాజెక్టు చాలా చేరువగా ఉంటుంది.

This website uses cookies.