- విమానాశ్రయం చేరువలో రాంకీ వన్ క్రిస్టల్
- ధర చదరపు అడుక్కీ..రూ.3899
- 6.1 ఎకరాల్లో 459 ఫ్లాట్లు
- ఫ్లాట్ల విస్తీర్ణం: 1165 – 1600 చ.అ.
వైజగ్ విమానాశ్రయం చేరువలోని శీలానగర్లో ‘క్రిస్టల్’ అనే లైఫ్ స్టయిల్ అపార్టుమెంట్లను రాంకీ వన్ సంస్థ ఆరంభించింది. సుమారు 6.1 ఎకరాల్లో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టులో ఏడు బ్లాకుల్లో 459 ఫ్లాట్లు వస్తాయి. ఒక బేస్ మెంట్ + జి+ 5 అంతస్తులో నిర్మించే ఈ ప్రాజెక్టులో వచ్చేవన్నీ ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లే కావడం గమనార్హం. రెండు పడక గదులు ఫ్లాట్లు 1165 చదరపు అడుగుల్లో ఆరంభమైతే.. మూడు పడక గదుల ఫ్లాట్లు 1495 మరియు 1600 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు.
* రాంకీ వన్ క్రిస్టల్ ప్రత్యేకత ఏమిటంటే.. వైజాగ్ విమానాశ్రయం, జాతీయ రహదారికి చేరువలోని.. ఎన్ఏడీ జంక్షన్, గాజువాక ల మధ్యలో ఈ ప్రాజెక్టును డెవలప్ చేస్తున్నారు. ఓఎన్జీసీ, హెచ్పీసీఎల్, వీఎస్పీ, బీహెచ్ఈఎల్, నౌకాశ్రయానికి సమీపంలో క్రిస్టల్ అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతారు. ఇక్కడ్నుంచి పేరెన్నిక గల స్కూళ్లు, ఆస్పత్రులు, రిక్రియేషన్ కేంద్రాలు, పబ్లిక్ గార్డెన్ వంటి వాటికి క్షణాల్లో చేరుకోవచ్చు. అతివేగంగా డెవలప్ అయ్యే వైజాగ్ ఇండస్ట్రీయల్ కారిడారుతో పాటు కు షాపింగ్ మాళ్లు, మల్టీప్లెక్సులు చేరువలో రాంకీ సంస్థ ఈ గేటెడ్ కమ్యూనిటీని ప్లాన్ చేసింది.
పెడస్ట్రీయన్ ఫ్రెండ్లీ పోడియం..
కార్ పార్కింగ్ మొత్తం బేస్ మెంట్లోనే ఉంటుంది కాబట్టి.. గ్రౌండ్ ఫ్లోరులో వాహనాలు తిరగవు. కాబట్టి, పిల్లా పాపలతో హ్యాపీగా నడుచుకుంటూ పచ్చటి పరిసరాల్ని ఆస్వాదించొచ్చు. వాస్తు సూత్రాలకు అనుగుణంగా.. మూడు వైపులా గాలీవెలుతురు వచ్చేలా చూడచక్కగా ఫ్లాట్లను డిజైన్ చేశారు. ప్రపంచ స్థాయి సదుపాయాలతో ఫుల్లీ లోడెడ్ క్లబ్ హౌజ్ ను సంస్థ డిజైన్ చేసింది. ఇందులో ఆధునిక స్విమ్మింగ్ పుల్, ల్యాండ్ స్కేప్ గార్డెన్స్, జాగింగ్ ట్రాక్, ఇండోర్, ఔట్ డోర్ గేమ్స్ వంటి వాటికి రాంకీ సంస్థ పెద్దపీట వేసింది.