Categories: LATEST UPDATES

రుణ‌గ్ర‌హిత‌ల‌కు ఆర్‌బీఐ శుభ‌వార్త

  • ఫిక్స్ డ్ వడ్డీ రేట్ల విధానానికి ఆర్బీఐ శ్రీకారం
  • ఇకపై వడ్డీరేట్లు పెరిగినా ఈఎఐలలో నో చేంజ్

ఇంటికి బ్యాంక్ లోన్ తీసుకున్నప్పటి నుంచి తిరిగి రుణం చెల్లించే వరకు కష్టంతో కూడుకున్న వ్యవహారం. ఇక వడ్డీ రేట్లు పెరిగినప్పుడల్లా ఈఎంఐలు పెరగడం మరో భారం. అయితే, ఇకపై వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా కొత్త విధానాన్ని ఆర్‌బీఐ అమ‌ల్లోకి తేనుంది. ప్రస్తుతం ఉన్న ఫ్లోటింగ్ వడ్డీ రేట్ల విధానం నుంచి ఫిక్స్ డ్ వడ్డీ రేట్ల విధానంలోకి మారేందుకు హోమ్ లోన్ కస్టమర్లకు అవకాశం క‌ల్పిస్తోంది.

సొంతిల్లు కోసం చాలా మంది పైసా పైసా కూడబెట్టి, దానికి తోడు బ్యాంకు లోన్ తీసుకుని ఇల్లు కట్టుకోవడమో లేదంటే కొనుక్కోవడమో చేస్తుంటారు. గృహ రుణం 10 నుంచి 30 సంవత్సరాల దీర్ఘకాలానికి తీసుకుంటారు. ఈ మధ్య కాలంలో వడ్డీ రేట్లు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం రుణ చెల్లింపులపై పడుతుంది. తగ్గడం చాలా అరుదు గాని రుణ వడ్డీ రేట్లు ఈ మధ్య కాలంలో పెరుగుతూనే ఉన్నాయి. ఇలా హౌజ్ లోన్ వడ్డీ రేట్లు పెరిగినప్పుడల్లా బ్యాంకులు చెల్లించాల్సిన ఈఎంఐల కాల వ్యవధిని పెంచుతుంటాయి. అటువంటి సందర్బాల్లో బ్యాంకులు రుణగ్రహీతల‌కు స‌మాచారాన్ని ఇవ్వ‌ట్లేదు. దీంతో, ఫ్లోటింగ్‌ వడ్డీ రేట్ల విధానం నుంచి ఫిక్స్‌డ్‌ వడ్డీ విధానానికి మారేందుకు అవకాశం ఇవ్వడంతో పాటు గృహ‌రుణం ముందస్తు చెల్లింపులకు రుణ గ్రహీతకు అనుమతించాలని ఆర్బీఐ నిర్ణయించింది.

This website uses cookies.