రాజపుష్ప ప్రాపర్టీస్ అంటే సకాలంలో నాణ్యతతో నిర్మాణాల్ని అందజేస్తుందనే ఖ్యాతినార్జించింది. ఈ సంస్థ కోకాపేట్లో చేపట్టిన రాజపుష్ప ఎటర్నా ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసింది. ఇందులో ట్రిపుల్ మరియు ఫోర్ బెడ్రూం ఫ్లాటును అలా కొనగానే ఇలా ఇంటీరియర్స్ చేయించుకుని గృహప్రవేశం చేయవచ్చు. పైగా ఫ్లాటును బుక్ చేస్తే జీఎస్టీని కట్టాల్సిన అవసమూ లేదు.
సుమారు 4.6 ఎకరాల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టును జి ప్లస్ 14 అంతస్తుల్లో నిర్మించారు. ఇందులోని ఫ్లాట్ల సంఖ్య కేవలం 290 మాత్రమే. సుమారు 2360 నుంచి 4340 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్లను నిర్మించారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. క్లబ్ హౌజును సుమారు 37 వేల చదరపు అడుగుల్లో నిర్మించారు. ధర విషయానికి వస్తే.. చదరపు అడుక్కీ రూ.8,999 చెబుతున్నారు.