2016లో చ.అ.కీ.. రూ.3600-4000
2024లో.. 10,000
గ్రేటర్ హైదరాబాద్ మహా నగరంలో వెస్ట్ ప్రాంతంలో శరవేగంగా అభివృద్ది చెందిన ప్రాంతం పొప్పాలగూడ. సరిగ్గా 20 ఏళ్ల క్రితం కేవలం గ్రామ పంచాయితీగా ఉన్న పొప్పాలగూడ.. ఇప్పుడు కనీవినీ ఎరుగని రీతిలో మారిపోయింది. అప్పటికీ.. ఇప్పటికీ ఏ మాత్రం గుర్తు పట్టలేనంతగా అభివృద్ది చెందింది. నివాస, వాణిజ్య కేంద్రాలకు కేంద్ర బిందువుగా మారిన పొప్పాలగూడ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో హాట్ కేక్ అని చెప్పాలి.
పొప్పాలగూడ 20ఏళ్ల క్రితం గ్రామ పంచాయితీగా ఉండగా ప్రస్తుతం మణికొండ మునిసిపాలిటీలో ఉంది. వెస్ట్ హైదరాబాద్ లో హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, కోకాపేట్, నానక్ రాంగూడ , మణికొండ తరువాత అంతటి స్థాయిలో పొప్పాలగూడ శరవేగంగా అభివృద్ది చెందింది. ప్రస్తుతం పొప్పాలగూడ లగ్జరీ రెసిడెన్షియల్ హబ్ కు కేంద్ర బిందువుగా మారింది. ఒకప్పటికీ, ఇప్పటికీ పొప్పాలగూడను పోల్చి చూస్తే అస్సలు పోలిక ఉండదు. 20 ఏళ్ల క్రితం 2004లో పుప్పాల గూడలో చదరపు గజం2 వేల రూపాయలుగా ఉండగా.. ప్రస్తుతం లక్షా యాభై వేల నుంచి కమర్షియల్ స్థలం అయితే 2 లక్షల వరకు ధరలున్నాయి. భూములైతే 2004లో ఎకరం కోటి రూపాయలు ఉండగా.. ఇప్పుడు ఎకరం 80 నుంచి 90 కోట్ల రూపాయలుగా ఉందని చెప్పొచ్చు.
పొప్పాలగూడలో జోరుగా నివాస, వాణిజ్య భవనాల నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాంతం ఔటర్ రింగ్ రోడ్డుకు పక్కనే ఉండటం కలిసివచ్చిందని చెప్పాలి. అటు పక్కన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇటు పక్కన హైటెకి సిటీ, మరోవైపు మణికొండ, సమీపంలోనే గచ్చిబౌలి ఉండటంతో పుప్పాలగూడ వేగంగా అభివృద్ది చెందింది. ఐటీ హబ్ కు కేవలం నిమిషాల వ్యవధిలోనే చేరుకునే అవకాశం ఉండటంతో చాలా మంది.. తమ నివాసం కోసం పొప్పాలగూడను ఎంచుకుంటున్నారు. 2016లో మైహోమ్ సంస్థ మైహోమ్ అవతార్ పేరిట భారీ గేటెడ్ కమ్మునిటీని నిర్మించడంతో ఈ ప్రాంతంపై అందరి చూపు పడింది. అప్పట్నుంచి నిర్మాణ సంస్థలన్నీ పొప్పాలగూడలో నిర్మాణాలు చేపట్టడం మొదలుపెట్టాయి. ప్రస్తుతం ఈ ఏరియాలో రాజపుష్ప, వాసవీ, మీనాక్షి, ఎస్ఏఎస్, సుమధుర వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు నివాస, వాణిజ్య నిర్మాణాలు చేపట్టాయి. ఇవే కాకుండా 20కి పైగా పలువురు బిల్డర్లు భారీ అపార్ట్ మెంట్స్ ను ఇక్కడ నిర్మిస్తున్నారు.
పొప్పాలగూడలో 2010 సంవత్సరంలో మైహోమ్ అవతార్ లో 60 లక్షల రూపాయాల్లో ట్రిపుల్ బెడ్రూం ఫ్లాట్ లభించేది. అంటే అప్పుడు చదరపు అడుగు 4వేల రూపాయలకు అటుఇటు ఉండేది. ఇప్పుడేమో చదరపు అడుగుకి 10 వేల రూపాయల నుంచి ప్రాజెక్టు, నిర్మాణాన్ని బట్టి 24 వేల రూపాయల వరకు చెబుతున్నారు. అంటే అపార్ట్ మెంట్ లో ఒక్కో ఫ్లాట్ 1.8 కోట్ల నుంచి 16 కోట్ల రూపాయల వరకు ధర పలుకుతోంది . 16 వేల చదరపు అడుగుల భారీ విస్తీర్ణంతో నిర్మాణమవుతున్న ఒక్కో ఫ్లాట్ ధర 20 కోట్ల రూపాయలపైనే ఉంది. ఇక విల్లాలైతే.. రూ. 12 కోట్ల నుంచి 25 కోట్ల దాకా రేటు చెబుతున్నారు.
This website uses cookies.