ఆస్పైర్ రియాల్టీ, భవ్య డెవలపర్స్ కలిసి కొల్లూరులో చేస్తున్న ప్రీలాంచ్ మాయ గురించి.. గత శనివారం రియల్ ఎస్టేట్ గురు ప్రచురించిన కథనంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. సంగారెడ్డి ఆర్డీవో ఆదేశాల మేరకు పటాన్ చెరు తహసీల్దారు, మండల పంచాయతీ అధికారి క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రాజెక్టులో ఏర్పాటు చేసిన బోర్డులను తొలగించారు. అక్కడ పనులింకా ఆరంభం కాలేదని తెలిపారు. ప్రజలెవ్వరూ అనుమతుల్లేని లేఅవుట్ల పేరిట జరిగే ప్రచారం నమ్మవద్దని అన్నారు. ప్లాట్లు, ఇళ్లు కొనాలని భావించేవారు అనుమతి పొందిన లేఅవుట్లలో మాత్రమే కొనాలని సూచించారు.
This website uses cookies.