poulomi avante poulomi avante

కంది రియాల్టీ క‌హానీ

  • ట్రిపుల్ ఆర్ జంక్షన్ తో
    మారిపోనున్న కంది రూపురేఖలు
  • ఆర్ఆర్ఆర్ మార్కింగ్ తో కంది
    పరిసరాల్లో భారీగా రియల్ వెంచర్లు

ఔటర్ రింగ్ రోడ్‌కు వెలుపల 347 కిలో మీటర్ల మేర తెలంగాణలోని పలు జిల్లాలను కలుపుతూ ప్రాంతీయ రింగ్ రోడ్డు ఏర్పాటు అవుతోంది. రీజినల్ రింగ్ రోడ్‌ సూపర్ గేమ్ ఛేంజర్ అవుతుందని, ఈ ప్రాజెక్ట్ వస్తే రాష్ట్ర స్వరూపం మారిపోతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మూడేళ్లలో రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది రేవంత్ సర్కార్. ఈ క్రమంలో రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా.. కంది దగ్గర నిర్మించే భారీ జంక్షన్ తో అక్కడ రియల్ ఎస్టేట్ రంగానికి మంచి భ‌విష్య‌త్తు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో మొత్తం 12 ఇంటర్ చేంజర్స్ నిర్మించేలా డిజైన్ చేశారు. జాతీయ, రాష్ట్ర రహదారులతో కనెక్ట్ అయ్యే ఈ 12 ప్రాంతాల్లో భారీ జంక్షన్స్ ఏర్పాటు కానున్నాయి. అంతర్జాతీయస్థాయిలో నిర్మాణం జరుపుకునే ఈ భారీ ఇంటర్ చేంజర్స్ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ గ్రోత్ కు మంచి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. రీజినల్ రింగ్ రోడ్డు ఇంటర్ చేంజర్స్ లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది హైదరాబాద్ ముంబై జాతీయ రహదారిపై కంది సమీపంలో వచ్చే జంక్షన్ గురించి. కంది దగ్గర నిర్మించబోయే ఇంటర్ చేంజర్ చుట్టు పక్కల భారీగా మౌలిక వసతులు ఏర్పాటు కానున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఇటు పటాన్ చెరు నుంచి జహీరాబాద్ వరకు పారిశ్రామికంగా అభివృద్ది చెందగా.. ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్డు, కంది దగ్గర వచ్చే భారీ జంక్షన్ తో ఈ ప్రాంతం మరింత అభివృద్ది చెందనుందని అంచనా వేస్తున్నారు.

ఎక‌రం ఎంత‌?

ఇప్పటికే రీజినల్ రింగ్ రోడ్డు కు సంబంధించిన‌ ముంబై జాతీయ రహదారిపై కందికి సమీపంలో మార్కింగ్ చేయగా.. అందుకు సంబంధించిన‌ భూసేకరణ పనులు 90 శాతం పూర్తయ్యాయి. కంది, సంగారెడ్డి మధ్య మొన్నటి వరకు నేషనల్ హైవే ఫెసింగ్ తో ఎకరం 2 కోట్ల రూపాయల నుంచి 2.5 కోట్ల రూపాయలు ఉండగా.. ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్డు జంక్షన్ ఏర్పాటు కానుండటంతో ఇక్కడ ఎకరం 2.8 కోట్ల నుంచి 3 కోట్లకు పెరిగిందని చెబుతున్నారు. జాతీయ రహదారి నుంచి 2 నుంచి 5 కిలోమీటర్ల రేడియస్ లో ఎకరం 1.5 కోట్ల నుంచి 2 కోట్ల రూపాయలు మేర ధరలున్నాయి. రీజినల్ రింగ్ రోడ్డు పనులు మొదలైతే భూముల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

గ‌జ‌మెంత‌?

ట్రిపుల్ ఆర్ జంక్షన్ ఏర్పాటయ్యే కంది సమీపంలోని సంగారెడ్డి సదాశివపేట, ఆరూర్, బుదేరా, జహీరాబాద్ వరకు ఇప్పటికే భారీ స్థాయిలో రియల్ వెంచర్లు వెలిశాయి. ఇక ఇప్పుడు రీజినల్ రింగ్ రోడ్డు ఇంటర్ చేంజర్ ఏర్పాటవుతుండటంతో భారీగా వెంచర్లు వేసేందుకు రియాల్ ఎస్టేట్ సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రస్తుతం కంది లో డీటీసీపీ లేఅవుట్ లో రియాల్టీ ప్రాజెక్టు, ప్రాంతాన్ని బట్టి చదరపు గజం 18 వేల నుంచి 35 వేల వరకు ధరలున్నాయి. ఇక కందికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న సంగారెడ్డిలో చదరపు గజం 15 వేల నుంచి 30 వేల వరకు ప్లాట్ల ధరలున్నాయి. కంది, సంగారెడ్డి తరువాత సమీపంలోని సదాశివపేట్ లో డీటీసీపీ లేఅవుట్ లో చదరపు గజం 13 వేల నుంచి మొదలు 22 వేల వరకు ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ తరువాత జహీరాబాద్ లో చదరపు గజం 12 వేల నుంచి 25 వేల వరకు ధరలున్నాయి.

spot_img
Hallmarkinfracon imperia

Follow Us

11,200FansLike
82,150FollowersFollow
31,210SubscribersSubscribe

Hot Topics

Related Articles