Categories: LATEST UPDATES

కొత్త నిబంధనలతో బయ్యర్లకు భరోసా

  • దివాలా పరిష్కార ప్రక్రియలో కీలక మార్పులు
  • కొనుగోలుదారులకు ఉపశమనం కలిగించే నిబంధనలు

ఇల్లు కొనడం అనేది మామూలు విషయం కాదు. ఏ వ్యక్తి అయినా తన జీవితకాలంలో పెట్టే అతిపెద్ద పెట్టుబడి ఇంటిపైనే. అయితే, ఇటీవల కొన్ని రియల్ సంస్థలు దివాలా తీయడంతో చాలామంది తమ డబ్బును పోగొట్టుకుంటున్నారు. జేపీ, ఆమ్రపాలి, యూనిటెక్, టుడే హోమ్స్, సూపర్ టెక్ లాజిక్స్ వంటి కేసులు ఇళ్ల కొనుగోలుదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. నోయిడాలోని ఒక్క జేపీ గ్రూప్ దివాలా తీయడంతో దాదాపు 20వేల మంది తమ ఇళ్ల కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. దీంతో పలువురు కొనుగోలుదారులు ఇల్లు కొనే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు బయ్యర్లకు భరోసా ఇస్తున్నాయి. కొనుగోలుదారులకు కొండంత ఉపశమనం కలిగించేలా దివాలా పరిష్కార ప్రక్రియలో దివాలా బోర్డు ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) కొన్ని మార్పులు చేసింది. వీటిని వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని కేంద్రం యోచిస్తోంది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే.. ఇళ్ల కొనుగోలుదారులకు బోలెడంత భరోసా లభిస్తుంది. ఇల్లు కొన్నవారికి ఆ ఇల్లు ఇవ్వడంలో బిల్డర్ విఫలమైతే.. వారు ఏ విధంగానూ నష్టపోకుండా ఉండేలా ఈ నిబంధనలు ఉపకరిస్తాయి.

కొత్త నిబంధనలు ఇవీ..

  • బిల్డర్లు తమ ప్రతి ప్రాజెక్టునూ రెరాలో నమోదు చేయాలి. అలాగే ప్రతి ప్రాజెక్టుకూ ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరవాలి.
  • పూర్తి మొత్తం చెల్లించి స్వాధీణం చేసుకున్న యూనిట్ల పై క్రెడిటర్ల కమిటీ ఆమోదంతో హక్కులు బదిలీ చేసుకోవచ్చు.
  • రిజిస్ట్రేషన్లు, సబ్ డీల్స్ క్రెడిటర్ల కమిటీ ఆమోదంతోనే చేయాలి.
  • ఒకవేళ కేటాయింపుదారుడు ప్రాపర్టీని స్వాధీనం చేసుకుని ఉంటే, అది లిక్విడేషన్ ఎస్టేట్ లో భాగం కాకుండా కొత్త ప్రతిపాదన
  • దివాలా చర్యను ఎదుర్కొనే అనేక కంపెనీలు బహుళ ప్రాజెక్టులు కలిగి ఉన్నందున ప్రతి ప్రాజెక్టుకూ ప్రత్యేక రిజల్యూషన్ పరిశీలించే అంశంలో కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ కు అనుమతి.

This website uses cookies.