Categories: LATEST UPDATES

రెరా పోర్టల్ అప్ డేట్ ఎప్పుడో?

  • గుజరాత్ లో రెరా 2.0 వెర్షన్
  • మన దగ్గరా అప్ డేట్ కావాలంటున్న నిపుణులు

దేశవ్యాప్తంగా రెరా చట్టం అమల్లోకి వచ్చి ఏడేళ్లు అవుతున్నా పోర్టల్ మాత్రం పరిస్థితులకు తగ్గట్టుగా అప్ డేట్ కాలేదనే అభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో గుజరాత్ రెరా తన కొత్త పోర్టల్ ఆవిష్కరించింది. రెరా చట్టంతోపాటు గుజరాత్ రెరా నిబంధనలతో సరికొత్త వెబ్ సైట్ ప్రారంభించింది. ఆదాయపన్ను, జీఎస్టీ విభాగాలు ప్రాజెక్టుల సరైన స్థితిగతులు తెలుసుకునేలా దీనిని రూపొందించింది. పన్ను మినహాయింపునకు సంబంధించి గతంలో కొందరు డెవలపర్లు త్రైమాసిక పురోగతి నివేదిక (క్యూపీఆర్)ల్లో పాత ఫొటోలు పొందుపరిచేవాళ్లు. కొత్త పోర్టల్ లో అలా కుదరదు. ప్రాజెక్టు రియల్ టైమ్ ఫొటోలనే పొందుపరచాల్సి ఉంటుంది.

దీనివల్ల ప్రాజెక్టు ఏ స్థితిలో ఉందనే విషయం ఆదాయపన్ను, జీఎస్టీ అధికారులకు సులభంగా తెలుస్తుంది. రెరా పాత వెర్షన్ లో పాత ఫొటోలను అప్ లోడ్ వీలుండేదని, కానీ కొత వెర్షన్ లో ప్రాజెక్టు రియల్ టైమ్ ఫొటోలు మాత్రమే అప్ లోడ్ అవుతాయని, దీనివల్ల ప్రాజెక్టు కచ్చితమైన స్థితి తెలుసుకునే అవకాశం ఉంటుందని ఓ అధికారి వెల్లడించారు. కాగా, గుజరాత్ రెరా పోర్టల్ అప్ డేట్ అయిందన, మన దగ్గర కూడా అలాంటి పోర్టల్ తీసుకువస్తే బాగుంటుందని హైదరాబాద్ రియల్ రంగ నిపుణులు సూచిస్తున్నారు.

This website uses cookies.