మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీని చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది. ఆ విభాగం తీసుకుంటున్న నిర్ణయాల్ని చూస్తే ఆనందమేస్తుంది. ఎందుకంటే, మహా రెరా బయ్యర్ల పట్ల పూర్తి స్థాయి పక్షపాతిగా వ్యవహరిస్తుంది. అదే సమయంలో అవినీతి చేసే బిల్డర్లకు సింహస్వప్నంగా మారుతోంది. ఈ క్రమంలో 117 ప్రాజెక్టుల నుంచి సుమారు రూ.160 కోట్లను వసూలు చేసింది. ఎందుకో తెలుసా? 2023-24 సంవత్సరానికి గాను సుమారు 237 రికవరీ వారెంట్ ఆర్డర్లను జారీ చేసింది. వాటి నుంచి దాదాపు రూ.160 కోట్లను వసూలు చేసి రికార్డు సృష్టించింది.
మరి, ఈ స్థాయిలో మన టీఎస్ రెరా ఎప్పుడు పని చేస్తుందోనని ఔత్సాహిక కొనుగోలుదారులు ఆశతో ఎదురు చూస్తున్నారు. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ చట్టం ప్రకారం రికవరీ వారెంట్ ఆర్డర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ఫిబ్రవరిలో కేంద్ర గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. కానీ, మన టీఎస్ రెరా మాత్రం ఇలాంటి ఆదేశాల్ని పెద్దగా పట్టించుకోదనే విషయం తెలిసిందే.
This website uses cookies.