గత ఐదేళ్లలో హైదరాబాద్ రియాల్టీని యూడీఎస్, ప్రీలాంచులు భ్రష్టు పట్టించిన విషయం తెలిసిందే. గత పాలకుల హయంలో జరిగిన రియల్ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. అక్రమాలతో నిండిపోయిన హైదరాబాద్ రియాల్టీని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాపాడాలని పలువురు డెవలపర్లు కోరుతున్న విషయం తెలిసిందే. విస్తుగొలిపే విషయం ఏమిటంటే.. క్రెడాయ్ హైదరాబాద్ వంటి నిర్మాణ సంఘానికి చెందిన కొందరు బిల్డర్లు.. ఎలాంటి మొహమాటం లేకుండా.. ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను విక్రయిస్తుండటం దారుణమైన విషయం. క్రెడాయ్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీద సంతకం పెట్టి.. అందులో సభ్యత్వం తీసుకున్నవారు.. ప్రీలాంచుల్లో ఫ్లాట్లను అమ్మడం ఎంతవరకూ కరెక్టో మీరే ఆలోచించాలి. ఇలా, కొందరు బిల్డర్లు చేస్తున్న నిర్వాకం వల్ల.. క్రెడాయ్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ భ్రష్టు పడుతుంది.
క్రెడాయ్ హైదరాబాద్ బిల్డర్లే ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను విక్రయించడాన్ని చూసి.. ఔత్సాహిక కొనుగోలుదారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. సదరు బిల్డర్ వద్ద ప్రీలాంచ్‌లో ఫ్లాట్లను కొనుకున్న తర్వాత.. సమయానికి ఫ్లాట్లను అప్పగిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రాజెక్టును ఆలస్యం చేసినా.. ఆ నిర్మాణానికి అనుమతి రాకున్నా.. అసలు సమస్య ఆరంభమవుతుంది. అందుకే, కొనుగోలుదారులేం చేయాలంటే.. క్రెడాయ్ హైదరాబాద్ బిల్డర్ అయినా మరే ఇతర నిర్మాణ సంఘం బిల్డర్ అయినా ప్రీలాంచుల్లో ఫ్లాట్లను విక్రయిస్తుంటే.. మొహమాటం లేకుండా వద్దని చెప్పండి. కాస్త రేటు ఎక్కువైనా.. మీకు సొంతింటి ఆనందాన్ని అందించే రెరా ప్రాజెక్టుల్లోనే ఫ్లాట్లను కొనుగోలు చేయండి.
This website uses cookies.