Categories: LATEST UPDATES

హోమ్ లోన్ దరఖాస్తు తిరస్కరణ.. ఫిర్యాదుదారుకు రూ.25వేల పరిహారం

ఐసీఐసీఐ హోమ్ ఫైనాన్స్ కు ఎన్సీఆర్డీసీ ఆదేశం

హోమ్ లోన్ కోసం పెట్టుకున్న దరఖాస్తును మూడేళ్లపాటు పరిష్కరించకుండా ఉన్నందుకు దరఖాస్తుదారునికి రూ.25వేల పరిహారం చెల్లించాలని ఐసీఐసీఐ హోం ఫైనాన్స్ ను నమక్కల్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్సీడీఆర్సీ) ఆదేశించింది.

తమిళనాడులోని వీజీ పట్టి జిల్లా కొత్తూరుకు చెందిన ఆర్.మురుగేశన్ 2019 జనవరిలో హోం లోన్ కోసం ఐసీఐసీఐ హోం ఫైనాన్స్ మైసూర్ బ్రాంచిని సంప్రదించారు. సంబంధిత అన్ని పత్రాలతోపాటు ప్రాసెసింగ్ ఫీజు నిమిత్తం రూ.3,540 చెల్లించారు. అయితే, కొత్త హౌసింగ్ లోన్ పాలసీ ప్రకారం ఆయన దరఖాస్తును తిరస్కరిస్తున్నట్టు 2019 ఏప్రిల్ లో పేర్కొంది. దీంతో మురుగేశన్ సంస్థకు వెళ్లి వారు అడిగిన డాక్యుమెంట్లతోపాటు మళ్లీ ప్రాసెసింగ్ ఫీజు కూడా చెల్లించారు.

అయితే, అప్పుడు కూడా ఆయన దరఖాస్తును తిరస్కరించారు. 2022 జూలైలో సంస్థ హెడ్ ఆఫీసు నుంచి మురుగేశన్ కు లెటర్ వచ్చింది. ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంట్లు తిరిగి ఇవ్వకపోవడానికి గల కారణాలను అందులో పేర్కొంది. దీంతో ఆయన ఎన్సీడీఆర్సీని ఆశ్రయించారు. వాదానలు విన్న కమిషన్ ప్రెసిడెంట్ వి.రామరాజ్, సభ్యుడు ఆర్.రామోలా తీర్పు వెలువరించారు. నాలుగు వారాల్లోగా ఫిర్యాదుదారునికి రూ.25వేలు చెల్లించాలని ఆదేశించింది.

This website uses cookies.