Categories: LATEST UPDATES

ప్రాజెక్టుల రిజిస్ట్రేషన్ కు మూడంచెల వ్యవస్థ..

  • లీగల్, ఫైనాన్షియల్, టెక్నికల్ అంశాల
    పరిశీలన తర్వాతే రెరా నెంబర్
  • రెరా కీలక నిర్ణయం

రెరా చట్టం అమలులో కొనుగోలుదారులకు మద్దతుగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి అద్భుతంగా పనిచేస్తున్న మహారాష్ట్ర రెరా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రాజెక్టులకు రెరా నెంబర్ ఇచ్చే ముందు మూడంచెల వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయ‌నుంది.

ఇకపై కొత్త గా రిజిస్ట్రేషన్ కు వచ్చే ప్రాజెక్టులకు సంబంధించి లీగల్, ఫైనాన్షియల్, టెక్నికల్ అంశాలను పరిశీలించిన తర్వాతే నెంబర్ కేటాయిస్తుంది. ఈ మూడే అంశాలను మూడు ప్రత్యేక స్వతంత్ర బృందాలను క్షుణ్నంగా పరిశీలిస్తాయి. అన్ని అంశాలూ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని సంతృప్తి చెందితేనే సదరు ప్రాజెక్టు రెరా నెంబర్ కేటాయిస్తారు. ప్రాజెక్టులు నిర్దేశిత గడువులోగా ఎలాంటి అవాంతరాలూ లేకుండా పూర్తి చేయడం, కొనుగోలుదారుల ఫిర్యాదులను జీరో కు తీసుకురావడమే ఈ కొత్త మెకానిజం ఉద్దేశమని మహారాష్ట్ర రెరా చైర్మన్ అజోయ్ మెహతా తెలిపారు.

ఈ మూడు పారామితుల్లో ఏది సరిగా లేకున్నా రెరా నెంబర్ ఇవ్వబోమని స్పష్టంచేశారు. కొనుగోలుదారులకు ఎలాంటి సమస్యలూ రాకుండా చూడటానికి ఈ కొత్త మెకానిజం ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. లీగల్ పరిశీలన సందర్భంగా భూమి యజామాన్యానికి సంబంధించి ఏమైనా వివాదాలు ఉన్నాయా? ఏ భూమిలో ప్రాజెక్టు నిర్మించోబోతున్నారు? లీగల్ టైటిల్ క్లియర్ గా ఉందా? లిటిగేషన్లు ఏమైనా ఉన్నాయా వంటి అంశాలను క్షుణ్నంగా పరిశీలిస్తారు. అలాగే డెవలపర్ వివరాలు, ఇతర ప్రాజెక్టుల్లో సదరు పెట్టుబడుల వంటివి కూడా చూస్తారు. ఇక ఫైనాన్షియల్ పరిశీలనలో.. డెవలపర్ తన ఫైనాన్షియల్ ఎన్ కంబరెన్స్ స్టేటస్ తోపాటు ప్రాజెక్టు వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. టెక్నికల్ పరిశీలనకు సంబంధించి లేఔట్, బిల్డింగ్ అప్రూవల్ ప్లాన్, ప్రాజెక్టు కమెన్స్ మెంట్ సర్టిఫికెట్, అనుమతి పొందిన అంతస్తుల సంఖ్య, మొత్తం ఫ్లాట్లు, నిర్మాణ ఏరియా తదితర వివరాలతోపాటు పలు స్వీయ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది.

This website uses cookies.