ముంబైలో భారీ అద్దె ఒప్పందం
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ అద్దె లావాదేవీ చోటు చేసుకుంది. సోలార్ మాడ్యూల్ తయారీ కంపెనీ రెన్యూసిస్ ఇండియా ముంబై సమీపంలో దాదాపు 7 లక్షల చదరపు అడుగుల పారిశ్రామిక స్థలాన్ని నెలకు రూ.1.43 కోట్లకు లీజుకు తీసుకుంది. Indra Logistics Park Private Limited ఇంద్ర లాజిస్టిక్స్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్, ఇక్షితా లాజిస్టిక్స్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ Ikshita Logistics Park Private Limited నుంచి మూడు పారిశ్రామిక యూనిట్లను 10 ఏళ్ల పాటు లీజుకు తీసుకుంటూ ఒప్పందం చేసుకుంది. 1.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మొదటి యూనిట్‌ను నెలకు రూ.27.14 లక్షలకు లీజుకు తీసుకున్నట్లు పత్రాలు చూపిస్తున్నాయి. 2.23 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రెండవ యూనిట్‌ను నెలకు రూ.45.90 లక్షలకు లీజుకు తీసుకున్నారు. .45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మూడవ యూనిట్‌ను నెలకు రూ.70.73 లక్షలకు లీజుకు తీసుకున్నారు. మూడు యూనిట్లకు సెక్యూరిటీ డిపాజిట్ రూ.5.73 కోట్లకు పైగా ఉందని పత్రాలు చూపించాయి.
ఈ లావాదేవీ మార్చి 31, 2025న రిజిస్టర్ కాగా, దీనికి రూ.2.16 కోట్ల స్టాంప్ డ్యూటీ, రూ.90వేల రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించారు. మూడు యూనిట్లను ఐదు సంవత్సరాల లాక్-ఇన్‌తో 10 సంవత్సరాల కాలానికి లీజుకు తీసుకున్నట్లు పత్రాలలో ఉంది. 36 నెలల తర్వాత 15% అద్దె పెరుగుదల, ఆ తర్వాత ప్రతి ఐదు సంవత్సరాలకు వార్షిక పెరుగుదల ఉంటుంది. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంతకు మించిన అద్దె ఒప్పంద నమోదైంది.
మహీంద్రా లాజిస్టిక్స్ లిమిటెడ్ పూణే సమీపంలోని ఖేడ్‌లో 4.75 లక్షల చదరపు అడుగుల గిడ్డంగి, లాజిస్టిక్స్ స్థలాన్ని ఐదు సంవత్సరాలకు సుమారు రూ.73 కోట్ల అద్దెకు లీజుకు తీసుకుంది. అలాగే, హిందూస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ ముంబై సమీపంలోని భివాండిలో 5.93 లక్షల చదరపు అడుగుల గిడ్డంగి స్థలాన్ని రూ.1.54 కోట్ల అద్దెకు తీసుకుంది.